Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సౌకర్యాల లేమిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకుండా హైకోర్టు ఏర్పాటు చేయడం వల్ల అందరూ పలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. హైకోర్టుకు వచ్చేందుకు రోజూ ఇబ్బందులు పడుతున్నామంది. హైకోర్టు న్యాయమూర్తులైన తమకు ఇప్పటివరకు నివాస గృహాలు కూడా లేవని, ఇప్పటికీ ప్రైవేట్ అతిథి గృహాల్లో ఉంటున్నామని, ఈ పరిస్థితి ఎంత కాలమని ప్రశ్నించింది. న్యాయవాదులు కార్లు పార్కింగ్ చేసేందుకు, కూర్చోడానికి తగినంత స్థలం లేదని, హైకోర్టు వద్ద ఒక్క కప్పు టీ కూడా దొరికే పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది. సౌకర్యాల లేమిపై న్యాయవాదుల నుంచి తమకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని తెలిపింది. సౌకర్యాల కల్పనకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.