గత వారం నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నాగ చైతన్య కొత్త సినిమా ‘థాంక్ యు’ని దిల్ రాజు బ్యానర్ లో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ బ్యానర్ లో అక్కినేని నాగేశ్వర్ రావు గారి చివరి సినిమా ‘మనం’ని అద్భుతంగా డీల్ చేసిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ మూవీ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నట్టు సమాచారం. నానితో చేసిన గ్యాంగ్ లీడర్ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో విక్రమ్ కుమార్ మళ్ళీ తనకు పట్టున్న జానర్ వైపే వస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా దీనికి హీరోయిన్లు లాక్ అయ్యారని ఫిలిం నగర్ టాక్. దాని ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్, తమిళ బ్యూటీ ప్రియా భవాని శంకర్ ని తీసుకున్నట్టు తెలిసింది.
ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీనా లేక డైరెక్టర్ స్టైల్ లో టిపికల్ గా డిఫరెంట్ గా సాగే ఎమోషనల్ డ్రామానా అనేది తెలియాల్సి ఉంది. చైతు రకుల్ ల కాంబినేషన్లో ఇప్పటికే రారండోయ్ వేడుక చూద్దాం లాంటి హిట్టు ఉంది. ఈ ఫ్రెష్ కాంబోని జనం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి అంటే అభిమానులు ఖచ్చితంగా పాజిటివ్ సెంటిమెంట్ గా ఫీలవుతారు. ఇక ప్రియా భవాని శంకర్ కోలీవుడ్ కుట్టి. అక్కడ చెప్పుకోదగ్గ చిత్రాలు చేస్తోంది, రిలీజ్ కావాల్సిన, షూటింగ్ దశలో ఆరు సినిమాలు ఉన్నాయంటేనే తన డిమాండ్ ని అర్థం చేసుకోవచ్చు. ఇది ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. థాంక్ యు లాంటి సాఫ్ట్ టైటిల్ పెట్టి ఎక్కువ క్లూస్ ఇవ్వకుండా జాగ్రత్త పడిన టీమ్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు ప్లాన్ చేసుకుంటోంది.
చైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. కొంత భాగమే బాలన్స్ ఉన్నప్పుడు లాక్ డౌన్ వల్ల ఆరు నెలలుగా బ్రేక్ పడిన ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత విడుదల ఎప్పుడు ఏ రూపంలో ఉంటుందనేది డిసైడ్ చేస్తారు. దీని తర్వాతే థాంక్ యు ఉంటుంది. సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజులో కూడా చైతు చేయాల్సి ఉంది ఎందుకో మరి ఎప్పటికప్పుడు ఆ ప్రాజెక్ట్ పెండింగ్ పడుతూనే వస్తోంది. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ ని లాక్ చేసినప్పటికీ నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అందుకే చైతు వేరే కమిట్ మెంట్స్ చేసుకుంటున్నాడు. హలో, గ్యాంగ్ లీడర్లు వరసగా నిరాశపరచడంతో విక్రమ్ కె కుమార్ కు థాంక్ యు హిట్ కావడం చాలా కీలకం