iDreamPost
iDreamPost
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం హైద్రాబాద్ జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుంది. నగరంలోని రోడ్లు అన్ని చెరువులను తలపించేలా నీరు ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు దిగ్బందంలోకి వెళ్ళిపోయాయి. హైద్రాబాద్ నగరంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటికి రావద్దని ఈదురుగాలులతో చెట్లు కరెంటు స్థంభాలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మరో పక్క వర్షం కారణంగా హైద్రబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారం అలుముకుంది. టోలీచౌకి , నదీం కాలనీలో వర్షపు నీరు ఇళ్ళలోకి చేరడంతో డిజాస్టర్ రెస్పాన్స్ టీం సహాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు చేపట్టినట్టు తెలుస్తుంది.