iDreamPost
iDreamPost
దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా ఇప్పటికే సామాన్యులతో పాటు అనేక మంది ప్రముఖులకి సోకింది. ఇప్పుడు తాజాగా కరోనా హెల్త్ బులిటన్ విడుదల చేసే కేంద్ర ఆరోగ్యా శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కూడా వైరస్ బారిన పడినట్టు అయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెళ్ళడించారు.
కరోనా లక్షణాలు కనపడటంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని కరోనా మార్గదర్శకాల మేరకు హోం ఐసోలేషన్ లో ఉంటున్నట్టు తెలిపారు. గత 15రోజులుగా తనతోపాటు విధుల్లో పాల్గొన్న సహ ఉద్యోగులు, తనని కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని. త్వరలోనే వారందరిని ఆరోగ్య బృందం కాంటాక్ట్ ట్రేసింగ్ చేస్తుంది అని చెప్పుకొచ్చారు.