iDreamPost
android-app
ios-app

IPL 2022: ‘బట్లర్‌ నాకు రెండో భర్త ,రాజస్తాన్‌ ఆటగాడి భార్య ఆసక్తికర వాఖ్యలు !

  • Published May 27, 2022 | 7:07 PM Updated Updated May 27, 2022 | 7:10 PM
IPL 2022: ‘బట్లర్‌ నాకు రెండో భర్త ,రాజస్తాన్‌ ఆటగాడి భార్య ఆసక్తికర వాఖ్యలు !

రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్ మీద మ‌రో స్టార్ క్రికెట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వైర‌ల్ అయ్యాయి. 15 మ్యాచ్‌లు ఆడిన బట్లర్‌.. 718 పరుగులతో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో బట్లర్‌ 89 పరుగులు సాధించి మ్యాచ్ ను గెలిపించాడు.

ఒక‌ప‌క్క బ‌ట్ల‌ర్ బౌండ‌రీలు బాదుతుంటే మ‌రోప‌క్క కెమేరా ఒక అమ్మాయిని త‌ర‌చు ఫోక‌స్ చేస్తూనే ఉంది. రాజస్తాన్‌ ఆటగాడు రాస్సీ వాన్ డెర్ డుస్సేన్ భార్య లారా.. బట్లర్‌ బౌండరీ బాదిన ప్రతీసారి చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా తిరుగేస్తోంది. కొద్దిరోజుల క్రితం రాజస్తాన్‌ రాయల్స్‌ పాడ్‌కాస్ట్‌లో, ధనశ్రీ వర్మ, పృతీ అశ్విన్‌లతో కలిసి మాట్లాడింది. లారాను బట్లర్‌ భార్య అని అంద‌రూ అనుకున్నారు. అందుకే పోడ్‌కాస్ట్‌లో ఇదే ప్రశ్నకు సమాధానమిస్తూ, నేను ఇప్పుడు జోస్‌ను నా రెండవ భర్తగా యాక్స‌ప్ట్ చేశాను. ఇక‌పై నన్ను లూయిస్ అని పిలుస్తారు. అతడి భార్య పేరుకూడా అదేన‌ని లారా చిలిపిగా సమాధానమిచ్చింది.

బ‌ట్ల‌ర్ బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు…ఆమె హుషారుగా చ‌ప్ప‌ట్లు కొట్ట‌డంతో ఆమెవైపు కెమేరాలు చాలాసార్లు తిరిగాయి. జ‌నంకూడా ఆమెను బ‌ట్ల‌ర్ భార్య అనుకున్నారు. చాలామంది పోస్ట్ లు కూడా చేశారు. అదే మాట లారా కూడా చెప్పింది. నేను అతడిని ఉత్సాహపరుస్తున్నానుకాబ‌ట్టి, అలాగే అనుకున్నారు. ధనశ్రీ గాని నేను గాని మ్యాచ్ చూస్తున్న‌ప్పుడు, మా ఎమోష‌న్స్ ను కంట్రోల్‌ చేసుకోలేం. జోస్‌ సెంచరీలు కొట్టిన‌ప్పుడు మరింత ఎంజాయ్‌ చేశాం. ఇక ఐపీఎల్‌లో రాస్సీ అంతగా ఆడలేదు. అందుకే అతన్ని నేను ఎంక‌రేజ్ చేయ‌లేక‌పోయాన‌ని లారా చెప్పింది.