తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో మరో గుండె ఆగింది. భవిష్యత్‌పై బెంగతో మియాపూర్-1 డిపోలో డ్రైవర్‌గా పనిచేసే ఎరుకాల లక్ష్మయ్య గౌడ్ గుండెపోటు మృతి చెందాడు. ఈ ఘటన గత శుక్రవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. లక్ష్మయ్య మృతికి నిరసనగా కార్మికులు మియాపూర్ డిపో ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మృతుడు నల్గొండ జిల్లాలోని మర్రిగూడవాసిగా తెలిసింది. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. 12రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.