iDreamPost
android-app
ios-app

హ్యాపీ బర్త్ డే టు “ప్రిన్స్ ఆఫ్ పోర్ట్ స్పెయిన్” లారా

హ్యాపీ బర్త్ డే టు “ప్రిన్స్ ఆఫ్ పోర్ట్ స్పెయిన్” లారా

ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లలో బ్రియాన్ చార్లెస్ లారా ఒకరు.ఈ రోజు తన 48వ పుట్టినరోజు జరుపుకుంటున్న లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్‌ బ్రియాన్ లారా ఒక క్రికెట్ ఐకాన్.అతను తన సమకాలీన అత్యుత్తమ బౌలర్ల బౌలింగ్ దాడులను ఎదుర్కొని మరీ బ్యాటింగ్‌లో రాణించాడు. భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సొగసైన స్ట్రెయిట్ డ్రైవ్‌లకు ప్రసిద్ధి కాగా, లారా అసాధారణమైన పుల్ షాట్‌లకు పేరెన్నిక గన్నాడు.టెస్ట్,వన్డే క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న అతి కొద్ది మంది బ్యాట్స్‌మెన్‌లలో లారా ఒకరు.2004లో ఆంటిగ్వాలో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌పై అజేయంగా 400 పరుగులు సాధించి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా లారా రికార్డు సృష్టించాడు.
ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కూడా అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌ రికార్డు బ్రియాన్ లారాదే.1994లో ఇంగ్లాండ్ కౌంటీ మ్యాచ్‌లలో ఎడ్జ్‌బాస్టన్‌లో డర్హామ్‌ జట్టుపై వార్విక్‌షైర్ తరఫున నాటౌట్‌గా 501 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో క్వింటపుల్ సెంచరీ ఇది ఒక్కటి మాత్రమే.లారా ఏకంగా 261 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 65 సెంచరీలతో 22,156 పరుగులు చేశాడు.

తన అంతర్జాతీయ కెరీర్‌లో లారా 131 టెస్టులు ఆడి 52.88 సగటుతో 11,953 పరుగులతో పాటు, 299 వన్డేలలో 40 పైగా సగటుతో 10,405 పరుగులు సాధించాడు.ఇక టెస్ట్ క్రికెట్‌లో 48 అర్థసెంచరీలు,34 సెంచరీలు చెయ్యగా వన్డేలలో 63 అర్థ సెంచరీలు,19 సెంచరీలు చేశాడు. ఏప్రిల్ 21, 2007న ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత వెస్టిండీస్ తరఫున లారా అన్ని క్రికెట్ ఫార్మేట్‌ల నుండి రిటైర్డ్ అయ్యారు. క్రికెట్ నుండి రిటైర్డ్ అయిన తర్వాత లారా గోల్ఫ్‌ క్రీడలోకి ప్రవేశించాడు. అక్కడ అనేక టోర్నమెంట్‌లను కూడా గెలుచుకున్నాడు.

హ్యాపీ బర్త్ డే టు “ప్రిన్స్ ఆఫ్ పోర్ట్ స్పెయిన్” లారా