నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కారును లారీ ఢీకొట్టడంతో కారు ధ్వంసం అయింది.
వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రయాణిస్తున్న కారును సోమవారం రాత్రి నాయుడుపేట మల్లాం జంక్షన్ దగ్గర లారీని ఢీకొనడంతో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. కాగా ఈ ప్రమాదం నుండి ఎమ్మెల్యే వరప్రసాద్ తృటిలో తప్పించుకున్నారు.
కాగా లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న ఎమ్మెల్యే కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం దెబ్బతినడంతో పాటు డ్రైవర్ హరికి గాయాలయ్యాయి. గాయపడిన కారు డ్రైవర్ ను వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదం కారణంగా కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను మరో కారులో అక్కడినుండి పంపించారు.