iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా పరంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నీలం సాహ్ని స్థానంలో బీహార్ కి చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఆధిత్యనాథ్ దాస్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31 నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక ఇప్పటివరకు సీఎస్ గా భాద్యతలు నిర్వహించిన నీలం సాహ్ని ను ముఖ్యమంత్రి ప్రిన్సిపాల్ అడ్వైజర్ గా నియమించగా. ఇటీవల తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు మారిన ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మి ను పురపాలక శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
బీహార్ కి చెందిన ఆధిత్యనాథ్ దాస్ 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. బెనారస్ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్ (1980-84), ఢిల్లీలోని జేఎన్‌యూలో ఇంటర్నేషనల్ స్టడీస్ (1984-86) చేశారు. విజయనగరం, విజయవాడ అసిస్టెంట్ కలెక్టర్‌గా, కృష్ణాజిల్లా జేసీగా, వరంగల్ కలెక్టర్‌గా, మురికివాడల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్, మునిసిపల్ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్, నీటి పారుదల శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఆయన సేవలందించారు. గతంలో వైఎస్ హయంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా ఆయన పనిచేయగలరనే అభిప్రాయంతో ఆయనకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కట్టబెట్టినట్టు తెలుస్తుంది.