iDreamPost
android-app
ios-app

మోగిన జీహెచ్‌ఎంసీ నగారా.. మేయర్‌ పదవి ఎవరికంటే..?

మోగిన జీహెచ్‌ఎంసీ నగారా.. మేయర్‌ పదవి ఎవరికంటే..?

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రిజర్వేషన్లును ప్రకటించింది.

డిసెంబర్‌ 1వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తామని ఎస్‌ఈసీ పార్థసారధి చెప్పారు. తక్షణమే కోడ్‌ అమలులోకి వస్తుందని వెల్లడించారు. రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్‌ 4వ తేదీన లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించనున్నారు.

రిజర్వేషన్లును ఎస్‌ఈసీ వెల్లడించారు. మేయర్‌ పదవిని జనరల్‌ మహిళలకు కేటాయించారు. 150 డివిజన్లలో 50 సీట్లు బీసీలకు కేటాయించారు. ఎస్సీలకు 10, ఎస్టీలకు 2 చొప్పన కేటాయించారు. రిజర్డ్వ్‌ సీట్లలో 50 శాతం ఆయా కులాల్లోని మహిళలకు కేటాయించారు. రిజర్డ్వ్‌ సీట్లు పోను మిగిలిన 88 సీట్లు జనరల్‌ కేటగిరిలో ఉంచారు. ఇందులో 44 సీట్లు జనరల్‌ మహిళలకు కేటాయించారు.

కోవిడ్‌ నేపథ్యంలో పోలింగ్‌ సమయాన్ని గంటపాటు పొడిగించారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అవసరమైన చోట డిసెంబర్‌ 3వ తేదీన రీపోలింగ్‌ చేపట్టనున్నారు.

ఇదీ షెడ్యూల్‌..

నామినేషన్ల దాఖలు : నవంబర్‌ 18 నుంచి 20 వరకు

నామినేషన్ల పరిశీలన : నవంబర్‌ 21

నామినేషన్ల ఉపసంహరణ : నవంబర్‌ 22

పోలింగ్‌ : డిసెంబర్‌ 1

రీపోలింగ్‌ : డిసెంబర్‌ 3

కౌటింగ్‌/ఫలితాల వెల్లడి : డిసెంబర్‌ 4