iDreamPost
android-app
ios-app

ఆ డివిజన్లలో అతి తక్కువ తేడాతోనే..?

ఆ డివిజన్లలో అతి తక్కువ తేడాతోనే..?

ఉధృతంగా జరిగిన గ్రేటర్‌ పోరు ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఈ నెల 1న పోలింగ్‌ పూర్తయింది. అప్పటి నుంచీ బూత్‌ల వారీగా పోలింగ్‌ శాతాన్ని బట్టి గెలుపోటములు బేరీజు వేసుకుంటున్న అభ్యర్థులు నేటి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆ పోలింగ్‌ శాతం కొన్ని డివిజన్లలో కొందరి అభ్యర్థుల రాతను మార్చేసేలా ఉంది. 150 డివిజన్లు గల గ్రేటర్‌లో చాలా డివిజన్లలో 40 నుంచి 45 శాతం లోపే పోలింగ్‌ నమోదైంది. దీంతో ఆయా డివిజన్లలో గెలుపోటముల మధ్య తేడా వందల సంఖ్యలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఎవరి కొంపు ముంచుతుందో..?

గ్రేటర్‌లోని 150 డివిజన్లలో మొత్తం పోలింగ్‌ శాతం 46.55 కాగా, 62 డివిజన్లలో 50 శాతం లోపు, 48 డివిజన్లలో 45 శాతంలోపు పోలింగ్‌ నమోదైంది. అత్యల్పంగా ఓట్లు పోలైన డివిజన్లలో ఎవరి కొంప మునుగుతుందో అన్న చర్చ జరుగుతోంది. అక్కడ ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా ఓట్ల తేడా వందలలోనే ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. 33 శాతం వార్డుల్లో సగటు కంటే తక్కువ పోలింగ్‌ నమోదైంది. ఆయా వార్డుల్లో 32 నుంచి 44 శాతం వరకే పోలింగ్‌ నమోదైంది. అత్యల్పంగా యూస్‌ఫగూడలో 32.99 శాతం అత్యల్ప పోలింగ్‌ నమోదైంది. మెహిదీపట్నంలో 34.41తో రెండో అత్యల్ప పోలింగ్‌ శాతంగా నమోదైంది. 40 శాతం లోపు పోలింగ్‌ 14 డివిజన్లలో నమోదు కాగా, 32 డివిజన్లలో 45 శాతం లోపు పోలింగ్‌ నమోదు అయింది. 50 శాతం లోపు పోలింగ్‌ 62 డివిజన్లలో నమోదైంది. 34 డివిజన్లలో 55 శాతం లోపు పోలింగ్‌ నమోదైంది. రెండు డివిజన్లలో 60 శాతం లోపు, మూడు డివిజన్లలో 65 శాతానికి పైగా పోలింగ్‌ నమోదయినట్లు అధికారులు ప్రకటించిన లెక్కలు చెబుతున్నాయి.

ఈ డివిజన్లలో ఉత్కంఠ

యూసు్‌ఫగూడలో 32.99, మెహిదీపట్నంలో 34.41 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారు. సరూర్‌నగర్‌ (38.18), సైదాబాద్‌ (38.18), ముసారాంబాగ్‌ (37.43), అక్బర్‌బాగ్‌ (39.43), సంతో్‌షనగర్‌ (35.93), విజయ్‌నగర్‌కాలనీ (37.90), అమీర్‌పేట్‌ (38.02), సనత్‌నగర్‌ (39.98), మాదాపూర్‌ (38.64), మియాపూర్‌ (36.25), హఫీజ్‌పేటలలో (38.31), చందానగర్‌ (39.40), హైదర్‌నగర్‌ (37.32), అల్విన్‌కాలనీ (39.50) డివిజన్లలో 40 శాతంలోపు పోలింగ్‌ నమోదైంది. ఈ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. పోలింగ్‌ మాత్రం తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల మధ్య గెలుపోటముల తేడా పెద్దగా ఉండదని పలువురు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో.. లేదా అంచనాలు తలకిందులయ్యేలా ఫలితాలు ఉంటాయో వేచి చూడాలి.