iDreamPost
android-app
ios-app

Ghani : శ్యామ్ కి దారి వదిలేసిన మెగా సినిమా ?

  • Published Nov 22, 2021 | 5:33 AM Updated Updated Nov 22, 2021 | 5:33 AM
Ghani : శ్యామ్ కి దారి వదిలేసిన మెగా సినిమా ?

వచ్చే నెల 24న నాని శ్యామ్ సింగ్ రాయ్ తో తలపడేందుకు సిద్ధమైన వరుణ్ తేజ్ గని రేస్ నుంచి తప్పుకున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. అఫీషియల్ గా చెప్పలేదు కానీ రేపో ఎల్లుండో ప్రకటించే అవకాశం ఉందని మెగా కాంపౌండ్ టాక్. ఆ డేట్ ని చాలా అడ్వాన్స్ గా లాక్ చేసుకుంది నాని టీమే. హఠాత్తుగా గని వచ్చి పడింది. ఇది కూడా డిసెంబర్ మొదటి రెండు వారాల్లో రావాలని ప్లాన్ చేసుకున్నదే. బాలయ్య అఖండ కోసం సైడ్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇప్పుడా త్యాగం మళ్ళీ చేయక తప్పడం లేదు. కాకపోతే ఇప్పుడు వదిలేస్తే చాలా గ్యాప్ వచ్చేస్తుంది కాబట్టి 24కి ముందు లేదా న్యూ ఇయర్ కు ముందు రిలీజ్ చేసేలా చర్చలు జరుగుతున్నాయట.

శ్యాం సింగ రాయ్ ని వాయిదా వేయించేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయని ఇంతకు ముందే లీక్ వచ్చింది. కానీ ఇది ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది. కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా కావడంతో నాని సోలో రిలీజ్ కోరుకున్నాడు. కానీ గని వస్తే థియేటర్ల సమస్యతో పాటు ఓపెనింగ్స్ ని పంచుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగానే తను ఫీలయ్యాడని కూడా వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు ఇద్దరు నిర్మాతల మీటింగ్ తర్వాత న్యాయంగా గనినే వెనక్కు తగ్గినట్టు తెలిసింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ అన్నయ్య బాబీ మొదటిసారి నిర్మాతగా మారి తీసిన గనిలో గట్టి ఆకర్షణలు ఉన్నాయి. ఉపేంద్ర చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న తెలుగు సినిమా ఇదే.

ఇలాంటి పరిణామాలు జరగడం మంచిదే. నువ్వా నేనా అని బాక్సాఫీస్ వద్ద తలపడే బదులు ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజీ పడటమే సర్వోత్తమం. తక్కువ గ్యాప్ ఉన్నా పర్వాలేదు ఒకరి తర్వాత ఒకరు వస్తేనే వసూళ్ల పరంగా కొంత వెసులుబాటు ఉంటుంది. ఇంకా జనాలు పూర్తి స్థాయిలో థియేటర్లకు రావడం లేదు. ఎంత పెద్ద హిట్ అయినా ఆ సంబరం కేవలం వీకెండ్స్ లో మాత్రమే కనిపిస్తోంది. అందులోనూ సరైన మాస్ సినిమాలు ఇప్పటిదాకా పడలేదు. అఖండతో మొదలుపెడితే శ్యామ్ సింగ రాయ్, గని లాంటివి ఆ ఆడియన్స్ ని ఆకర్షించే అవకాశం ఉంది. మరి కొత్త తేదీ విషయంలో గని ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి

Also Read : Bheemla Nayak : 90 కోట్ల టార్గెట్ తో పవన్ రిపోర్టింగ్

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Giriş