Idream media
Idream media
ఉస్మానియా అరుణతారా, హైదరాబాద్ చెగువేరా, ఈ శతాబ్దపు వీరుడు కామ్రేడ్ జార్జిరెడ్డి జీవిత కథాంశం పై జీవన్ రెడ్డి దర్శకత్వంలో హీరో శాండి జార్జిగా వస్తున్న జార్జి రెడ్డి సినిమా రేపే విడుదల కానుంది. చరిత్ర మరవని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుని జీవితచరిత్రను వెండి తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్ ను ఉస్మానియా స్కాలర్స్ అభినందించడం జరిగింది.వందేళ్ల ఓయూలో ఎంతో మంది వీరుల గాథలు ఇప్పటికే నిక్షిప్తమై ఉన్నాయని వాటన్నింటిని ప్రజలకు చేర్చే బాధ్యతను భుజానకెత్తుకోవాలని చిత్ర యూనిట్ కు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ స్కాలర్స్ చనగాని దయాకర్, డి. రంజిత్, లెనిన్ రాజు, రాజేష్, రామకృష్ణ, సతీష్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.