ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నలుగురు కామాంధులు మైనర్ బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్నూలు జిల్లా అవుకు పట్టణంలో జరిగింది. అవుకు చెందిన ఓ మైనర్ బాలుడిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నలుగురు యువకులు అతడిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దారుణానికి పాల్పడుతూ సెల్‌ఫోన్లో రికార్డు చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు.
బాధిత బాలుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన అవుకులో తీవ్ర చర్చనీయాంశమైంది. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
4397