కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి బూటా సింగ్ కన్నుమూశారు. 1962లో ఆయన తొలిసారి లోక్‌సభకు ఎన్నికయిన ఆయన 1970, 80 దశకాల్లో ఆయన ఖలిస్తాన్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1978లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.ఆపరేషన్ బ్లూ స్టార్‌లో అనంతరం స్వర్ణ దేవాలయం పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.
బూటా సింగ్ 1982లో రాష్ట్రపతి పదవి కోసం పోటీ పడి జ్ఞానీ జైల్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం 1984 నుంచి 1986 వరకూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1986 నుంచి 1989 వరకు రాజీవ్ గాంధీ క్యాబినెట్‌లో హోంశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.2004 నుంచి 2006 వరకు బీహార్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇందిరా గాంధీ , రాజీవ్ గాంధీలకు అత్యంత సన్నిహితమైన నేతగా గుర్తింపు పొందిన ఆయన 2007 నుంచి 2010 వరకు షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్‌కు చైర్మన్‌గా చేశారు. పంజాబీ స్పీకింగ్ స్టేట్.. ఏ క్రికెట్ అనాలసిస్ అనే పుస్తకాన్ని రాశారు. కాగా ఆయన మృతి పట్ల ప్రధాని మోడీ,కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు విచారం వ్యక్తం చేశారు.