ప్రఖ్యాత కార్ల కంపెనీ ఫోర్డ్ ఇండియా తన ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించింది. ఇండియాలో ఫోర్డ్ కార్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇక గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. కార్ల ఉత్పత్తి నిలిపివేసి, కేవలం ఇంజిన్ కి సంబంధించి విడిభాగాలు మాత్రం తయారు చేస్తామని ప్రకటించింది. మార్కెట్లో ఉన్న తమ కంపెనీ కార్ల సర్వీస్ కి ఢోకా లేకుండా చూస్తామని తెలిపింది.
దేశంలో ఇటీవల ఆటోమొబైల్ రంగం తీవ్ర అవస్థల్లో పడుతోంది. లాక్ డౌన్ తర్వాత వాహన అమ్మకాలు అమాంతంగా పడిపోయాయి. ఇటీవల అవి కొంత మెరుగవుతున్నా కరోనాకి ముందు పరిస్థితులు ఎన్నటికీ అన్నది అంతుబట్టకుండా ఉంది. అదేసమయంలో దేశీయ మార్కెట్లో మారుతి, హుందాయి, హోండా, టాటా వంటి కంపెనీలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. అందులోనూ మారుతి సుజుకి దే 40శాతం వాటా ఉంటోంది. ఈ పోటీలో ఫోర్డ్ అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు.
Also Read:ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి ఆయనే!
అగ్రస్థానంలో ఉన్న మారుతి సుజుకి కూడా తమ మొత్తం ఉత్పత్తిని కుదించడం గమనార్హం. అన్ని యూనిట్లు సామర్ధ్యానికి అనుగుణంగా తయారీ చేయడం లేదు. దాంతో ఇతర కంపెనీల పరిస్థితి అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలో ఫోర్డ్ మనుగడ కష్టంగా మారింది. దాంతో కొత్త కార్ల ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయానికి వచ్చారు. దేశంలోని రెండు యూనిట్లు వచ్చే ఏడాది నాటికి కొత్త కార్ల తయారీ నిలిపివేస్తామని తెలిపింది.
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన అమెరికన్ కంపెనీ ఫోర్డ్ మోటార్స్ ని 1903 లో ప్రారంభించారు. ఆ తర్వాత అనేక దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఫోర్డ్ కార్ల పట్ల ప్రత్యేక ఆసక్తి కూడా ఉంటుంది. అయితే ఇండియాలో ఆర్థిక వృద్ధి రేటు పడిపోవడం సహా అనేక కారణాలతో కొత్త కార్ల కొనుగోళ్లలో మెరుగుదల నిలిచిపోయింది. దాంతో ఫోర్డ్ ఇండియా కి 2 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో కంపెనీ తయారీ యూనిట్లు మూతవేసేందుకు నిర్ణయం తీసుకుంది. సుమారు 11 వేల మంది ఉద్యోగులకు సంబంధించి సెటిల్ మెంట్ కోసం చర్చలు చేస్తున్నట్లు ఫోర్డ్ ఇండియా ప్రకటించింది.
Also Read:పోలవరం ప్రాజెక్టులో మరో ముందడుగు , పూర్తయిన గ్యాప్ 3 డ్యామ్
ఓ వైపు ప్రభుత్వరంగ సంస్థలను మోదీ సర్కారు అమ్మకానికి పెడుతోంది. మరోవైపు ప్రసిద్ధ ఎంఎన్ సి లు సైతం దేశంలో అమ్మకాలు.లేవంటూ కంపెనీలు మూత వేసే దిశలో ఉన్నారు. ఫోర్డ్ ఇండియా కి సంబంధించిన గుజరాత్ , చెన్నై యూనిట్లు 2022 ఆర్థిక సంవత్సరం చివరకు మూత వేసేందుకు సన్నద్ధమయ్యింది. మిగిలిన కంపెనీల విషయం కూడా ఊగిసలాటలో ఉంది. దేశాభివృద్ధి విషయంలో ప్రభుత్వ విధానాలు గట్టి మార్పు అవసరం,ఆర్ధిక వ్యవస్థకు ,కంపినీలకు దోహదపడే నిర్ణయాలు తీసుకోవాలి.