iDreamPost
android-app
ios-app

చేపల లోడు లారీ బోల్తా.. అరగంటలో మొత్తం ఖాళీ

  • Published Jun 07, 2022 | 12:32 PM Updated Updated Jun 07, 2022 | 12:32 PM
చేపల లోడు లారీ బోల్తా.. అరగంటలో మొత్తం ఖాళీ

చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దాంతో లారీలో ఉన్న చేపలన్నీ రోడ్డుపై పడ్డాయి. ఇది చూసిన చుట్టుపక్కల ప్రజలు అరగంటలో చేపలన్నింటినీ ఎత్తుకుపోయారు. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఏపీ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వైపు చేపల లోడుతో వెళ్తున్న లారీ.. జిల్లాలోని బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్డు వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలవ్వగా.. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

బోల్తా పడిన లారీ వద్ద ఉన్న చేపల కోసం స్థానికులు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఒక్కొక్కరు సంచులకొద్దీ చేపలను తీసుకెళ్లారు. ట్రాఫిక్ జామ్ అవుతుందని పోలీసులు చెప్పినా.. పట్టించుకోలేదు. ఒక్కో చేప 2 కేజీల బరువుండే.. సుమారు 4 వేల చేపల లోడ్ ను అరగంటలో ఖాళీ చేసేశారు.