iDreamPost
android-app
ios-app

ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం : సినీ ఫక్కీలో లాయర్లుగా ఎంట్రీ ఇచ్చి

ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం : సినీ ఫక్కీలో లాయర్లుగా ఎంట్రీ ఇచ్చి

దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి కోర్టులో గ్యాంగ్ వార్ కలకలం రేగింది. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ జితేంద్ర అలియాస్ గోగిని కాల్చి చంపారు ఇద్దరు దుండగులు. ఆ తర్వాత కోర్టు ప్రాంగణంలో ఉన్న పోలీసులు కూడా కాల్పులు జరపడంతో ఎటాక్ చేయడానికి వచ్చిన ఇద్దరు కూడా మరణించారు. ఈ కాల్పుల్లో గోగి సహా నలుగురు మరణించినట్లు నిర్ధారించబడింది. వారిలో ఒకరు గోగి కాగా, గోగిపై దాడి చేయడానికి వచ్చిన ముగ్గురు కూడా పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణించారు. వారిలో ఒకరు రాహుల్ కాగా అతని తల మీద 50 వేల రూపాయల రివార్డు ఉంది.

లాయర్ల వేషధారణలో..

మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న జితేందర్‌ గోగి తీహార్ జైలులో ఉన్నాడు, అతనిని శుక్రవారం కోర్టులో ప్రవేశ పెట్టేందుకు తీసుకువచ్చారు. ఇంతలో, రోహిణి కోర్టు ప్రాంగణంలో లాయర్ల వేషధారణలో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు ఈ సమయంలో, తొక్కిసలాటలో ఒక మహిళా న్యాయవాది కూడా గాయపడ్డారు. అయితే ఎదురు కాల్పుల్లో మహిళా లాయర్‌కు తీవ్ర గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి, దీనిని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. దాదాపు 35 నుంచి 40 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. గోగిని రెండు సంవత్సరాల క్రితం గురుగ్రామ్ లో ఢిల్లీ స్పెషల్ సెల్ అరెస్టు చేసింది. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ప్రకారం, జితేంద్ర గోగి నేరాల ద్వారా చాలా వెనకేశాడు.

Also Read : జేసీ దివాకర్‌ రెడ్డి లేటెస్ట్‌.. ఇక అక్కడ నుంచి రాజకీయం

అతను కూడా ఎన్ కౌంటర్లో

గోగితో పాటు కుల్దీప్ ఫాజ్జా కూడా పట్టుబడగా కుల్దీప్ ఫజ్జా మార్చి 25 న పోలీసుల కస్టడీ నుండి తప్పించుకున్నాడు. ఫజ్జా ఆసుపత్రి నుంచి నుండి తప్పించుకోగా ఆ తర్వాత అతని ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక రెండు గ్యాంగ్‌ల మధ్య విభేదాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. 30 ఏళ్ల జితేంద్ర గోగి మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ ఎంసీవో సీఏ కింద అరెస్టు కాగా అతని మీద హత్యలు, హత్యాయత్నం, ఎక్స్ టార్షన్ సహా మొత్తం 19 కేసులు ఉన్నాయి.

ఢిల్లీ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం, దుండగులు జితేంద్ర మన్ గోగిపై కాల్పులు జరిపడంతోనే అతను మరణించాడు. ముగ్గురు దుండగులను కూడా పోలీసులు చంపారు. ఈ ముగ్గురు దుండగులు న్యాయవాది దుస్తులలో వచ్చారు. ఆ ముగ్గురూ టిల్లు గ్యాంగ్ సభ్యులు అని అంటున్నారు. గోగి గ్యాంగ్‌కు టిల్లు గ్యాంగ్‌తో పాత శత్రుత్వం ఉంది. 2018 లో ఢిల్లీ బురారీలో టిల్లు గ్యాంగ్‌తో గోగి జియాంగ్ కి గ్యాంగ్ వార్ జరిగింది, ఇందులో ముగ్గురు టిల్లు గ్యాంగ్ సభ్యులు మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు.

2020 లో గోగిని అరెస్టు చేసినప్పుడు, భారీ మొత్తంలో డ్రగ్స్ అలాగే ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గోగికి ఢిల్లీ పోలీసుల నుంచి నాలుగు లక్షలు మరియు హర్యానా పోలీసుల నుంచి రెండు లక్షలు రివార్డ్ ఉంది. ప్రముఖ హర్యానీ గాయని, నర్తకి హర్షిత హత్య కేసులో జితేంద్ర అలియాస్ గోగి పేరు కూడా వినిపించింది.

Also Read : కుప్పంలో వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం వెనుక ఎవరున్నారు..?