బిగ్ బాస్ రియాల్టీ షోలో గొడవలు సర్వసాధారణం. అవి లేకపోతే షో నడవడం కూడా కష్టమే. గొడవల్ని సృష్టించేది బిగ్ బాస్. ఆ గొడవల్లోంచి ఎవరు ఎలా బయటపడ్తారన్నది మిగతా ఆట. ప్రేక్షకులు ఆ గొడవల్ని బట్టి, అందులో ఎవరి క్యారెక్టర్ ఎలాంటిది.? అని నిర్ణయించేసుకుంటారు. అయితే, గొడవకి వెనుక, ముందు.. పెద్దగా ప్రచారంలోకి రాదు. కేవలం గొడవ మాత్రమే హైలైట్ అవుతుంది. తాజాగా నోయెల్ – సోహెల్ మధ్య గొడవ జరిగింది. గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్యా చీటికీ మాటికీ గొడవలు జరుగుతున్నాయి. అవిప్పుడు ఇంకా ఎక్కువయ్యాయి. ‘కట్టప్ప ఎవరు?’ అనే అంశానికి సంబంధించి ‘స్టాంపింగ్’ ఎపిసోడ్ జరిగితే, సోహెల్ అత్యుత్సాహం చూపాడు. అయితే, ఇక్కడ నోయెల్ తప్పిదం కూడా వుంది. సెల్ఫ్ స్టాంపింగ్‌కి అవకాశం లేదని గత సీజన్‌లోనూ నిరూపితమయినా, నోయెల్ అదే పని చేశాడు. దీన్ని అదనుగా చేసుకుని సోహెల్ రెచ్చిపోయాడు. అలా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. అయితే, ఈ గొడవలో ఎవరిది తప్పు? అని మనం డిసైడ్ చేసెయ్యలేం. ఈ రోజు తిట్టుకుంటారు, రేప్పొద్దున్న కలిసిపోవచ్చు కూడా. లేదంటే, సీజన్‌లో ఇద్దరూ వున్నంతవరకూ ఈ గొడవ కంటిన్యూ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదొక పెద్ద డ్రామా. ఇక, ఈ డ్రామాపై బిగ్‌హౌస్‌లో రకరకాల చర్చలు జరుగుతోంటే, సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. నోయెల్‌కి సపోర్ట్‌గానే ఎక్కువగా చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో.