iDreamPost
android-app
ios-app

ఆవును హెలికాప్టర్ ద్వారా తరలించిన రైతు.. ఎందుకో తెలుసా?

ఆవును హెలికాప్టర్ ద్వారా తరలించిన రైతు.. ఎందుకో తెలుసా?

ఆవు..భారతదేశంలో హిందువులు పవిత్రంగా పూజించే జంతువు. గోమాతను అన్ని దేవతలు కొలువుండే ప్రాణిగా హిందువులు భావిస్తారు. కాబట్టి భారతదేశంలో గోవులకు ఆదరణ ఆరాధన ఎక్కువ. అదే గోవుకు ఏదైనా దెబ్బ తగిలితే తమకే తగిలింది అన్నంత బాధతో భారతీయులు విలవిల్లాడతారు.కాగా కొందరు గోవులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. తాజాగా ఒక వ్యక్తి తాను ప్రేమగా పెంచుకునే ఆవుకు దెబ్బతగిలితే హెలికాప్టర్ లో తరలించి ఆ గోవుపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.కానీ ఈ సంఘటన జరిగింది గోవును పవిత్రంగా పూజించే భారతదేశంలో కాదు..స్విట్జర్లాండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఆల్ప్స్‌లోని ఓ పర్వతంలో నిర్వహించిన బోడెన్‌ఫహార్డ్ ఈవెంట్‌కు తరలించిన ఆవు గాయపడి కుంటుతూ నడవ‌డాన్ని రైతు గమనించాడు. ఎక్కువ దూరం నడిస్తే ఆవు ఇబ్బంది పడుతుందని రైతు భావించి ఆవును నడిపించకుండా ఇంటికి ఎలా తీసుకెళ్లాలి అని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. హెలికాప్టర్ సాయం కావాలని రెస్క్యూ టీమ్ ని కోరడంతో వెంటనే హెలికాప్టర్ వచ్చింది.రెస్క్యూ టీమ్ వచ్చి ఆవుకి తాళ్లు కట్టి హెలికాప్టర్‌ ద్వారా పైకి లేపి పర్వతాల్లోంచి ఆవును  తీసుకొచ్చారు.

సోషల్ మీడియాలో ఆవును హెలికాప్టర్ లో తరలిస్తున్న వీడియో వైరల్ గా మారింది. రైతుకు ఆవుపై ఉన్న ప్రేమను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసిస్తున్నారు.