iDreamPost
android-app
ios-app

పుష్ప 3 జరిగే పనేనా?

  • Published Dec 15, 2022 | 7:24 PM Updated Updated Dec 15, 2022 | 7:24 PM
పుష్ప 3 జరిగే పనేనా?

ఇప్పటికే ఏడాది గడిచిపోయింది. పుష్ప 1 బ్లాక్ బస్టర్ అయిన సంవత్సరానికి రెండో భాగం ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టిన దర్శకుడు సుకుమార్ వద్ద పుష్ప 3కి కూడా కథ సిద్ధంగా ఉందట. అయితే ఇప్పుడప్పుడే తీసే ఆలోచన లేదు లెండి. కనీసం అయిదేళ్ళు గ్యాప్ తీసుకుని అప్పుడు మళ్ళీ ఈ ఫ్రాంచైజ్ ని కొనసాగించేలా అల్లు అర్జున్ సుక్కు ప్లాన్ చేసుకున్నారట. నిజానికి ఈ సబ్జెక్టు రాయడం మొదలుపెట్టినప్పుడు సుకుమార్ ఒక వెబ్ సిరీస్ తరహాలో సెట్ చేశారు. ఒక అనాథ ట్రక్కు డ్రైవర్ అడవిని పోలీసులను గడగడలాడించే ఇంటర్ నేషనల్ డాన్ గా ఎలా మారాడనే పాయింట్ మీద సుదీర్ఘమైన నిడివితో ఒక స్కెచ్ ప్రకారం అనుకున్నారు

అనుకోకుండా ఒక సందర్భంలో బన్నీ ఈ లైన్ వినడం వెంటనే చేసేందుకు రెడీ కావడంతో ఇది కాస్తా సినిమాగా మారిపోయింది. అయితే సుకుమార్ కు పుష్పని సింపుల్ గా ముగించాలని లేదు. ఫహద్ ఫాసిల్ తో యుద్ధం ఏ మలుపు తిరిగింది, ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎలా చేరుకున్నాడు, తర్వాత పతనం ఎలా మొదలయ్యింది లాంటివన్నీ టచ్ చేస్తారట. క్లైమాక్స్ లో మళ్ళీ జీరో దగ్గర నుంచి పుష్ప మరో జీవితాన్ని వెతుక్కునేలా ఎండ్ చేసి మూడో భాగానికి చిన్న లీడ్ ఇస్తారన్న మాట. రామ్ చరణ్ ని చివర్లో చూపిస్తారనే ప్రచారంలో నిజం లేదని టాక్. రంగస్థలంలో చిట్టిబాబు భార్యగా చేసిన రామలక్ష్మి పుష్ప 1లో ఐటెం సాంగ్ ఎలా చేస్తుందనే లాజిక్ ఉందిగా

మొత్తానికి పుష్ప స్కెచ్ మాత్రం మాములుగా లేదు. వీలైనంత వరకు 2023 రిలీజ్ ఉండేలా మైత్రి సంస్థ టార్గెట్ పెట్టుకుంది. అయితే సాధ్యమవుతుందా లేదానేది వేచి చూడాలి. ఒకవేళ మిస్సయితే 2024 సంక్రాంతి తప్ప ఆప్షన్ ఉండదు. అల వైకుంఠపురములో తర్వాత పుష్ప 1కు కొంత గ్యాప్ తీసుకున్న బన్నీ మళ్ళీ సీక్వెల్ కోసం ఇంత సమయం ఖర్చు చేయాల్సి రావడం అభిమానులకు అసంతృప్తి కలిగిస్తున్నా జాతీయ స్థాయిలో ప్యాన్ ఇండియా గుర్తింపు రావడం పట్ల సంతోషంగానే ఉన్నారు. సుమారు మూడు కోట్ల ఖర్చుతో ఒక టీజర్ ని రూపొందించే ఆలోచనలో సుక్కు ఉన్నారట.అవతార్ 2తో అటాచ్ చేద్దామనుకున్నారు కానీ సాధ్యపడలేదు

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet