iDreamPost
iDreamPost
చింతమనేని ప్రభాకర్.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. తన దూకుడైన శైలితో నిత్యం వార్తలో నిలుస్తుంటారు. మంత్రి, అధికారి ఎవరైనా సరే వారిపై ఒంటికాలిపై లేస్తుంటారు. ఈ క్రమంలోనే కేసులు, జైళ్లు పాలయ్యారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తన రూటు ఎప్పుడూ సపరేటైనని చింతమనేని ప్రభాకర్ ప్రవర్తిస్తుంటారు.
తాజాగా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద వారం రోజులుగా పెద్ద ఎత్తును కోడి పందేలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి ముగిసి 50 రోజులు కావస్తున్నా ఇక్కడ కోడిపందాలు కొనసాగుతుండటం గమనార్హం.. ఈ కోడి పందేలు చింతమనేని ప్రభాకర్ మద్దతుతో జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ కోడి పందేలపై సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు వాటికి అడ్డుకట్ట వేయడానికి రంగంలోకి దిగారు. నిన్నరాత్రి కోడిపందేలు జరుగుతున్న ప్రాంతానికి పొలిసు బృందాలు వెళ్లగా పందెం రాయుళ్లు తమ కార్లు, కోళ్లను అక్కడే వదిలేసి పరారయ్యారు.ఈ దాడులకన్నా ముందు చింతమనేని ప్రభాకర్ అక్కడే ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. దాదాపు 20 కార్లు, కోళ్లు, పెద్ద మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోళ్లను, వాహనాలను స్టేషన్‌కు తరలించారు.
కొందరు పోలీస్ అధికారులు కోడి పందేలకు సహకరిస్తున్నారు. నిన్నకూడా పోలీస్ దాడుల గురించి కొందరు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వడంతోనే చింతమనేని ప్రభాకర్, ఇతరులు అక్కడనుండి తప్పుకున్నట్లు సమాచారం..
చింతమనేని ప్రభాకర్ ఇటీవలే రెండు నెలల పాటు జైల్లో ఉండి బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ కోడిపందేల్లో కూడా చింతమనేని పాత్ర మీద ఆధారాలు దొరికితే చింతమనేని మరోసారి జైలుకు వెళ్లాల్సి రావొచ్చు.. పందెం బరి వద్ద 20 కార్లు పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో వాటి ఆధారంగా సదరు కార్ల యజమానులపై కేసులు నమోదు చేయవచ్చు. మరి పోలీసులు ఈ దిశగా ఆలోచిస్తారా..? లేదా..? వేచి చూడాలి.