iDreamPost
android-app
ios-app

తొలి.. తుది.. నారా లోకేశ్ కొత్త చరిత్ర

తొలి.. తుది.. నారా లోకేశ్ కొత్త చరిత్ర

తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ, తొలి మహిళా స్పీకర్ ప్రతిభా పాటిల్, తొలి తెలుగు ప్రధాని పివి నరసింహరావు, ఆంధ్రప్రదేశ్ తొలి సీఎం నీలం సంజీవ రెడ్డి, తుది సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఇలా ఆయా వ్యక్తుల గురించి ఎప్పుడైనా మాట్లాడుకోవాల్సి వస్తే చాలా అరుదుగా గుర్తు చేసుకునే విషయాలు. సాధారణంగా పోటీ పరీక్షల విద్యార్థులు ఉన్నత పదవులను చేపట్టిన తొలి, తుది వ్యక్తుల గురించి బాగా గుర్తుపెట్టుకుంటారు. పరీక్షలో వారి గురించి ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఏదీ సాదారణం.

ఐతే ఇప్పుడు ఈ చరిత్ర మారుతోంది. ఉన్నత పదవులు అలంకరించిన తొలి, తుది నేతల సందర్భాల పరిధిని తెలుగుదేశం నాయకులు పెంచుతున్నారు. సీఎం చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ పేరుతో కొత్త చరిత్ర లిఖిస్తున్నారు. ఆంద్రప్రదేశ్ విడిపోయిన తరవాత ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన తనయుడు నారా లోకేశ్ ఎమ్మెల్సీగా ఎన్నికై, పంచాయతీ రాజ్, ఐటి శాఖలకు మంత్రిగా పని చేశారు. సీఎం తనయుడు కావడంతో ప్రభుత్వంలో నారా లోకేశ్ కు సాధారణంగానే ప్రాధాన్యత వచ్చింది. ఇక వందిమాగదులు నారా లోకేష్ ను ఆకాశానికి ఎత్తింది. యువ రాజుగా కీర్తించింది. సీనియర్ నేతలు మంత్రి గారికి సాహో అన్నారు. పదవి లో ఉన్నంత కాలం స్కోత్కర్షకు బాగా అలవాటు పడిన నారా లోకేశ్ పదవి లేనప్పుడు కూడా అలాంటి భజనే కావాలని కోరుకుంటున్నట్లుగా పరిస్థితి ఉంది.

Read Also: యడ్డి నిలిచేనా?

మాజీ మంత్రి అంటే నారా లోకేశ్ కు మనసు ఒప్పుకోవడం లేదేమో..? టీడీపీ నేతలు, శ్రేణులు ఆయన్ను… ” నవ్యంధ్రప్రదేశ్ తొలి పంచాయతీ రాజ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్” గా సంభోదిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ ఇలాగే పిలుస్తున్నారు. అంతేకాకుండా మీడియా కు నారా లోకేష్ పర్యటన సమాచారం ఇచ్చే సమయంలో కూడా ” నవ్యంధ్రప్రదేశ్ తొలి పంచాయతీ రాజ్, ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ ఈ రోజు విశాఖ పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. కవర్ చేయాల్సిందిగా కోరుతున్నాము” అని సందేశాలు పంపిస్తున్నారు. ఈ తంతు చూస్తున్న టిడిపి లోని ఓ వర్గం నేతలు, మీడియా ప్రతినిధులు ఫక్కున నవ్వుకుంటున్నారు.

మంత్రి పదవి లేకున్నా మాజీ మంత్రి అని పిలిపించుకోవడానికి నారా లోకేశ్ ఇష్టపడడం లేనట్లుగా పరిస్థితి ఉండడం కొత్త చరిత్రకు బీజం వేసింది. 2009 లో ప్రజా రాజ్యం తరపున పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు.. ఎన్నికల తరువాత ” ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్” అని ఫ్లెక్సీలు వేయించుకుని కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ” ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్” ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్” అనే పద్దతి కొనసాగుతోంది. తాజాగా లోకేశ్ శ్రీకారం చుట్టిన తొలి మంత్రి లాగా భవిష్యత్ లో నవ్యంధ్రప్రదేశ్ తొలి ఎమ్మెల్యే అనే సంభోదనలు వినిపించినా ఆశ్చర్యం లేదు.