iDreamPost
android-app
ios-app

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్‌

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కర రావు హత్య కేసులో నిందితుడుగా ఉన్న కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సినీ పక్కిలో మఫ్టీలో ఉన్న పోలీసులు కొల్లు రవీంద్రను తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని సీతారామపురంలో అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారి నుంచి విశాఖ వెళుతున్న కొల్లు రవీంద్రను మఫ్టీలో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన్ను విజయవాడకు తీసుకొస్తున్నారు.

ఈ నెల 1వ తేదీన మోకా భాస్కర రావును మచిలీపట్నం చేపల మార్కెట్‌ వద్ద పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. 24 గంటల్లో పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారిలో ప్రధాన నిందితుడు టీడీపీ మాజీ కౌన్సిలర్‌ చింతా చిన్నిగా గుర్తించారు. అతనితోపాటుమరో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారు ఇచ్చిన వాగ్మూలం మేరకు కొల్లు రవీంద్రను ఈ హత్య కేసులో నిందితుడిగా చేరుస్తూ పోలీసులు ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ రోజు ఉదయం విచారణ నిమిత్తం ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే రవీంద్ర పరారయ్యారు. ఇంటిని సోదా చేసిన పోలీసులు రవీంద్ర ఫోన్‌ నంబర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆయన కదిలికలపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విశాఖకు వెళుతున్న రవీంద్రను తుని వద్ద జాతీయ రహదారిపై ఆపి అదుపులోకి తీసుకున్నారు.