iDreamPost
android-app
ios-app

జగన్‌ దయ వల్లే టీడీపీ బతికి ఉంది.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

జగన్‌ దయ వల్లే టీడీపీ బతికి ఉంది.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ ప్రస్తుత పరిస్థితిపై మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీడీపీ ఉనికి ఉందంటే అది వైఎస్‌ జగన్‌ దయ వలనే అని ఉన్నారు. వైఎస్‌ జగన్‌ పెట్టిన షరతు వల్లనే టీడీపీ బతికి ఉందన్నారు. పార్టీలో చేరాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని సీఎం జగన్‌ పెట్టిన షరతుతోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో కొనసాతున్నారని వ్యాఖ్యానించారు. లేదంటే 22 మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేవారని జోస్యం చెప్పారు.

అచ్చెం నాయుడుపై ఇంత ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు.. కోడెల శివప్రసాద్‌ మీద ఎందుకుచూపించలేదని టీడీపీ మాజీ నేత అయిన దాడి ప్రశ్నించారు. కోడెల మృతికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. అచ్చెం నాయుడు బలహీన వర్గాల నాయకుడు కాదని, టీడీపీనాయకుడు మాత్రమేనని దాడి వీరభద్రరావు స్పష్టం చేశారు.

అవినీతిపరులపై సీఎం జగన్‌ యుద్ధం ప్రకటించారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు వెన్నులో వనుకు మొదలైందన్నారు. టీడీపీ హయాంలో జరిగిన ప్రతి అవినీతి పని వెనుక చంద్రబాబు, లోకేష్‌లు ఉన్నారని దాడి ఆరోపించారు. అచ్చెం నాయుడును అరెస్ట్‌ చేస్తే బీసీ అని, జేసీ ప్రభాకర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేస్తే కక్ష సాధింపు చర్యల అనడం సరికాదన్నారు. ఈఎస్‌ఐ కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత ఉందో తేలాల్సిన అవసరం ఉందన్నారు.

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Girişjojobetjojobet giriş