iDreamPost
iDreamPost
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ESI మందుల కొనుగోళ్ల కుంభకోణంలో త్వరలోనే చార్జిషీట్ వెయ్యబోతుబోతున్నట్టు ఏసీబీ జేడీ రవికుమార్ వెళ్ళడించారు. ఈ కేసులో ఇప్పటికే 12మందిని అరెస్టు చేశామని, మరో 8 మందిని అరెస్టు చేయాల్సి ఉందని, వీరిలో మాజీ మంత్రి పితాని కుమారుడు వెంకట సురేష్ కూడా ఉన్నారని వారికోసం ఏసీబీ బృందాలు గాలిస్తున్నాయని చెప్పుకొచ్చారు.
ఈ కేసులో మొత్తం రూ.975 కోట్ల కొనుగోళ్లలో రూ.150 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు గుర్తించామని, లక్ష విలువ దాటితే ఈ–ప్రొక్యూర్‌మెంట్‌కు వెళ్లాలి కానీ ఉద్దేశపూర్వకంగా నామినేషన్ కింద కట్టబెట్టారు అని, ఈ వ్యవహారంలో కడప ప్రాంతీయ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ జనార్దన్ కీలకపాత్ర పోషించినట్టు కనుగొన్నామని , బడ్జెట్‌కు మించి అధిక ధరలతో కొనుగోళ్లు జరిపినట్టు గుర్తించామని తెలిపారు. ఇందులో కొన్ని మందులు ఏకంగా 140% ఎక్కువ రేటుకు కొన్నట్టు సాక్ష్యాలు లభించాయని చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా ఇండెంట్‌లు లేకుండానే డిస్పెన్సరీల నుంచి కొన్న మందులు కూడా ఆస్పత్రులకు చేరలేదని, అమరావతి, తిరుమల వంటి మెడికల్ ఏజెన్సీలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చి ఆ తర్వాత మాయమయ్యాయి. డ్రగ్స్‌కు రూ.293.51 కోట్లు కొనుగోలు అవకాశం ఉండగా, రూ.698.36 కోట్లకు కొన్నారని మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఫలానా కంపెనీకే ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారని, ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు ఇవ్వడం వేరు, ఖచ్చితంగా చేయాలని ఆర్డర్ లెటరు ఇవ్వడం వేరని, టెలీహెల్త్ సర్వీసెస్‌కు సంబంధించి అచ్చెన్నాయుడు మొత్తం మూడు లేఖలు ఇచ్చినట్టు ఆధారాలు లభించాయని దీంతో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఆ సర్వీసు ప్రొవైడరూ ఇద్దరూ నిందితులేనని స్పష్టం చేశారు.