Idream media
Idream media
ఆంద్రప్రదేశ్ లో ఇకపై టీచర్ ఉద్యోగం సాధించాలంటే ఇంగ్లీష్ మీద సాము చేస్సాయాల్సిందే. జగన్ సర్కారు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో భోదన తప్పని సరి చేయడం తో ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయులు, రాబోయే రోజుల్లో ఉద్యోగాలు సాదించే వారు తప్పనిసరిగా ఇంగ్లీష్ లో ప్రావిణ్యం సాధించాలి. అది కూడా పిల్లలకు భోదించేంతగా ఇంగ్లీష్ లో సిద్దహస్తులవ్వాలి. లేదంటే తిప్పలు తప్పవు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు తెలుగు మినహా అన్ని సబ్జెక్ట్ లను ఇంగ్లీష్ లోనే భోదించాలి. పైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దెందుకు జగన్ సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే నాడు- నేడు కార్యక్రమం ప్రకటిచింది. రెండేళ్ల తర్వాత ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేలా పాఠశాల నేటి ఫోటో.. రెండేళ్ల తర్వాత ఫోటోలు తీయనున్నారు. తాజాగా ఇంగ్లీష్ మీడియంలో భోదన కు అనుగుణంగా చర్యలు చేప్పట్టబోతోంది.
జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు వైఎస్సార్ సిపి సర్కారు ప్లాన్ చేస్తోంది. ఇటివల విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ డిఎస్సి విషయమై ప్రకటన చేసారు. అంతేకాకుండా ఇంగ్లీష్ బోధన పై తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేసారు. ఇంగ్లీష్ లో భోదన చేసేలా రాబోయే డిఎస్సి లో ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెప్పారు. మంత్రి ప్రకటన, ఇంగ్లీష్ బోధన పై ప్రభుత్వ చర్యలు నేపథ్యంలో రాబోయే డిఎస్సి లో విజయం సాధించాలంటే అభ్యర్థులకు ఇంగ్లీష్ భాష పై గట్టి పట్టు తప్పక ఉండాలి. ప్రాధమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు తెలుగులోనే చదివిన బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు రాబోవు డిఎస్సి లో ఉద్యోగం సంపాదించాలంటే చమటోడ్చాల్సిందే.