iDreamPost
android-app
ios-app

ఇంగ్లీష్ లో చదవకపోతే మనకే నష్టం

  • Published Nov 11, 2019 | 7:18 AM Updated Updated Nov 11, 2019 | 7:18 AM
ఇంగ్లీష్ లో చదవకపోతే మనకే నష్టం

మన పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవకపోతే నష్టపోయేది మనమేనని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 132 వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంగ్లిష్ మీడియంలో బోధనను వ్యతిరేకించే వారిపై ప్రశ్నలు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను విమర్శిస్తున్నచంద్రబాబు, వెంకయ్య నాయుడు, పవన్ కళ్యాణ్ పిల్లలు ఏ స్కూళ్లలో, ఏ మీడియం లో చదివారని ప్రశ్నించారు.  పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో చదవకపోతే నష్టపోయేది మన కుటుంబాలే అని , పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మొదట  45 వేల పాఠశాలకు గాను 15 వేల పాఠశాలలో నాడు- నేడు కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి పాఠశాలలో టాయిలెట్స్, ఫర్నిచర్, ప్రహరీగోడ అవసరమైన అన్ని వస్తువులను నాడు-నేడు కార్యక్రం ద్వారా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు లేదా ఉర్దూ భాషా తప్పని సరి చేస్తామని స్పష్టం చేసారు. కానీ ఇంగ్లీష్ మీడియం లో భోదన తప్పని సరిచేస్తామని పునరుద్ఘాటించారు. 

ముస్లింలు కోసం మదర్శా బోర్డు ఏర్పాటు చేస్తామని సీమ  జగన్ ప్రకటించారు. మదర్శాలలో నాణ్యమైన విద్య అందిస్తామని, మదర్శాలు ఒప్పుకుంటే అక్కడ పిల్లలకు కూడా అమ్మ ఒడి పధకం వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు 

వచ్చే ఏడాది నుండి  1 -6 వ తరగతి వరకు మొదట ఇంగ్లీష్ మీడియం చేస్తామని తెలిపారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కొక్క క్లాస్ ని ఇంగ్లీష్ మీడియంలో కి చేరుస్తామని చెప్పారు. పత్రి విద్యార్థి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రాయాలన్నదే తన లక్ష్యంమని, ఇంటర్, పాలిటెక్నిక్ ,డిగ్రీ చదువులతో  ఉద్యోగం వచ్చేలా మార్పులు చేస్తామని వివరించారు. ఏడాది పాటు ఇంటర్న్షిప్ తప్పని సరిగా చేసేలా నూతన విధానం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. .ప్రతి విద్యార్థికి  ఫీ రీయంబర్స్మెంట్ పూర్తిగా ఇస్తామని, అంతే కాకుండా ఏడాదికి 20 వేలు.. వసతి భోజనఖర్చుల నిమిత్తం ఇస్తామని తెలిపారు. దానితోపాటు  వైఎస్సార్ పెళ్లి కానుక రెట్టింపు చేస్తామని వరాల జల్లులు కురిపించారు .