iDreamPost
android-app
ios-app

Encounter, Maoist Shot Dead – మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు.. ఈసారి 26 మంది ఎన్ కౌంటర్.. మరింత పెరిగే అవకాశం?

Encounter, Maoist Shot Dead – మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు.. ఈసారి 26 మంది ఎన్ కౌంటర్.. మరింత పెరిగే అవకాశం?

మావోయిస్ట్ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మరణం తర్వాత మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ మధ్య తెలంగాణలోని ములుగులో పోలీసుల ఎన్ కౌంటర్ లో ముగ్గురు కీలక నేతలు చనిపోగా, ఉత్తరాదికి చెందిన పలువురు సీనియర్ నేతలను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. తాజాగా మహారాష్ట్రలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లోనూ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఎన్ కౌంటర్ లో ఏకంగా 26 మంది నక్సలైట్లు మరణించడం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి.

మహారాష్ట్రలో పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో శనివారం పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది నక్సలైట్లు మరణించారు. ఈశాన్య ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వద్ద ఎన్ కౌంటర్ జరగగా దానికి సంబంధించి గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయెల్ కీలక వివరాలు వెల్లడించారు. ముంబైకి 920 కిలోమీటర్ల దూరంలో ఉన్న గడ్చిరౌలి జిల్లాలోని 11 బట్టి అడవుల్లోని ధనోరా వద్ద శనివారం ఉదయం పోలీసు బృందం జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో ఎన్‌కౌంటర్ జరిగిందని ఆయన చెప్పారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారు.

ప్రాథమిక సమాచారం మేరకు ముందు మావోయిస్టులు పోలీసు సిబ్బందిపై కాల్పులు జరిపారని, దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారని అధికారి వెల్లడించారు. ‘ఇప్పటి వరకు 26 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు మాకు సమాచారం అందింది’ అని ఆయన చెప్పారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులు కూడా గాయపడ్డారని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయెల్ తెలిపారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. 

Also Read :  Bhola Cyclone -అయిదు లక్షల మందిని అంతం చేసిన భోలా తుఫాను

ఈ నేపథ్యంలో మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం, పోలీసులు ఇదే ప్రాంతంలో 2 లక్షల రివార్డ్ ఉన్న నక్సలైట్ మంగారు మాండ్విని అరెస్టు చేశారు. సదరు నక్సలైట్ పై హత్య, పోలీసులపై దాడికి సంబంధించి అనేక కేసులు నమోదయ్యాయి. అతను ఇచ్చిన సమాచారమ్మేరకే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు అని తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో పోలీసులు అనేక నక్సలైట్ల శిబిరాలను ధ్వంసం చేశారు.

పోలీసులు నక్సలైట్లపై ఈ ఆపరేషన్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించగా కొన్ని గంటల పాటు కొనసాగింది. గాయపడ్డ పోలీసులను చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో నాగ్‌పూర్‌కు తరలించారు. ధాచిరోలి జిల్లా కోర్చి తాలూకాలోని కోట్‌గుల్ ప్రాంతంలోని ఎలెవెన్‌బట్టి అడవుల్లో నక్సలైట్లు శిబిరం ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. పూర్తిగా సన్నద్ధమైన తర్వాత, సి-60 అనే పోలీసు బృందం నక్సలైట్లపై ఆపరేషన్‌ను ముమ్మరం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఒక బృందం సెర్చ్ ఆపరేషన్ కోసం బయలుదేరింది.

వెంటనే పోలీసు బృందం నక్సలైట్ల స్థావరాలకు చేరుకుంది. నక్సలైట్లు పోలీసుల రాకపై సమాచారం అందుకుని వచ్చీ రావడంతోనే పోలీసులపైకి కాల్పులు ప్రారంభించారు. నక్సలైట్లకు ధీటుగా సమాధానం చెప్పేందుకు పోలీసులు కూడా వారిపై దాడికి దిగారు. మృతి చెందిన నక్సలైట్ల లో కొందరు పెద్ద తలకాయలు కూడా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో గత వారం రోజులుగా జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు. ఈ నలుగురు నక్సలైట్లపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.5 లక్షల రివార్డు ప్రకటించింది. చనిపోయిన ముగ్గురు మహిళా నక్సలైట్‌ లు చాలా నేరాలకు సూత్రధారులుగా ఉన్నారు.

Also Read : Railway To Drop ‘Special Train’ Tag – స్పెషల్‌ దోపిడీకి రెడ్‌ సిగ్నల్‌