Idream media
Idream media
‘దిశ’ హత్య కేసులో నిందితుడు శివను ఎన్‌కౌంటర్ చేయడంపై అతని తండ్రి స్పందించారు. ఎన్‌కౌంటర్ చేయడంపై తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. అయితే కనీసం చివరిసారిగా ముఖం చూపించకుండా, మాట్లాడనీయకుండా ఎన్‌కౌంటర్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను చంపుతామని పోలీసులు తనకు చెప్పినా బాధ ఉండదన్నారు. కానీ చివరిసారిగా ఒకసారి మాట్లాడించి, ముఖం చూపిస్తే బాగుండేదని.. ఆ విధంగా లేకుండా చేశారన్నారు.
పోలీసులు ఇంటికొచ్చి విచారణ చేసినప్పుడు కూడా ఉరిశిక్ష వేసినా తనకు అభ్యంతరం లేదని చెప్పామన్నారు. కనీసం తమతో ఒకసారి మాట్లాడించినట్లయితే సంతోషంగా ఉండేదన్నారు. పోలీసులు కావాలనే ఎన్‌కౌంటర్ చేశారని శివ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, నలుగురు నిందితులు ఆ కుటుంబాల్లో ఒక్కొక్కరే మగ సంతానం కావడం యాదృచ్చికం.