iDreamPost
android-app
ios-app

జీవీకే స్కాంలో ఈడి దూకుడు

  • Published Jul 28, 2020 | 7:06 AM Updated Updated Jul 28, 2020 | 7:06 AM
జీవీకే స్కాంలో ఈడి దూకుడు

ముంబై విమానాశ్రయ కుంభకోణం కేసుకు సంబంధించి జివికె గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌పై ఈడి గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)ను నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా 730 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న ఈ కేసులో జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) శోధనలు నిర్వహించింది.

730 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై జి వెంకట కృష్ణారెడ్డి, జివి సంజయ్ రెడ్డి, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), మరో తొమ్మిది ప్రైవేట్ సంస్థలపై సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేయగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన ECIR లో ఈ కుంభకోణం ఫలితంగా 2012 మరియు 2018 మధ్యకాలంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని పేర్కొంది.