iDreamPost
android-app
ios-app

ఆ పార్టీ కొడుకుదే.., తేల్చి చెప్పిన ఎన్నికల సంఘం..

  • Published Oct 05, 2021 | 10:58 AM Updated Updated Oct 05, 2021 | 10:58 AM
ఆ పార్టీ కొడుకుదే.., తేల్చి చెప్పిన ఎన్నికల సంఘం..

పిట్టపోరు పిట్టపోరు.. పిల్లి తీర్చినట్లు లోక్ జనశక్తి(ఎల్జేపీ)లో తలెత్తిన ఆధిపత్య పోరుకు కేంద్ర ఎన్నికల సంఘం పరిష్కారం చూపింది. దాని ప్రకారం దివంగత నేత రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లోక జనశక్తి పార్టీ అతని కుమారుడు చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని కొనసాగుతుంది. పశుపతినాథ్ పరాస్ నేతృత్వంలోని చీలిక వర్గానికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పేరు ఖరారు చేశారు. ఎల్జేపీ వాడుతున్న ఎన్నికల గుర్తును మాత్రం ఎవరికీ కేటాయించకుండా ఈసీ అధికారులు స్తంభింపజేశారు. దానికి బదులుగా చిరాగ్ పార్టీకి హెలికాఫ్టర్, పశుపతి పార్టీకి కుట్టు మిషన్ గుర్తు కేటాయించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Read Also:- మోదీ.. ప్ర‌జా సేవ‌లో 20 ఏళ్లు.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 20 ఏళ్లు.

పాశ్వాన్ మరణం అనంతరం చీలిన పార్టీ

బీహార్ సీనియర్ నేత రామ్ విలాస్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీని స్థాపించి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉండేవారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మరణానంతరం పార్టీ అధ్యక్ష పదవిని కుమారుడు చిరాగ్ పాశ్వాన్ చేపట్టారు. పార్టీలో కీలక నేతగా ఉన్న చిరాగ్ బాబాయి పశుపతి నాథ్ పరాస్ నేతృత్వంలో మరికొందరు కొన్ని నెలల క్రితం తిరుగుబాటు చేసి చిరాగ్ నేతృత్వాన్ని సవాల్ చేశారు. ఐదుగురు ఎంపీలు పరాస్ వెంట నడవడంతో తమదే అసలైన లోక్ జనశక్తి పార్టీ అని ప్రకటించుకున్నారు. పశుపతిని అధ్యక్షుడిని చేశారు. ఈ చీలిక వర్గాన్ని లోకసభ స్పీకర్ కూడా ఆమోదించారు. ఈ రెండు వర్గాల మధ్య అప్పటినుంచీ వివాదం కొనసాగుతోంది.

Read Also:- నెగ్గిన అవిశ్వాస తీర్మానం – సుంకర పావని ఇక మాజీ మేయర్‌

ఎన్నికల గుర్తుపై పట్టు

ఇదే తరుణంలో బీహార్లో ఖాళీగా ఉన్న కుశ్వేశ్వర ఆస్థానా, తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ప్రకటించడంతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఎల్జేపీ ఇంతవరకు వాడుతూ వచ్చిన బంగ్లా ఎన్నికల గుర్తును వాడుకునేందుకు తమకంటే.. తమకే కేటాయించాలని కోరుతూ రెండు వర్గాలు ఎన్నికల కమిషన్ కు లేఖలు రాయడంతో కమిషన్ ఆ గుర్తును స్తంభింపజేసింది. ఇరువర్గాల వాదనలను పూర్తిగా విన్న అనంతరం ఎల్జేపీని చిరాగ్ కు కేటాయించింది. పశుపతి నేతృత్వంలోని వర్గానికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పేరుతో రిజిస్టర్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇరువర్గాల అభీష్టం మేరకు వేర్వేరు గుర్తులు కేటాయించింది.

Read Also:- మీసాల రాజు గారు ఇప్పుడు ఏమి చేస్తున్నారు..?