Idream media
Idream media
నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్ చివరి దశకు చేరుకుంది. 22వ రౌండ్ పూర్తయ్యే నాటికి బీజేపీ 1309 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది. ఇక చివరి రౌండ్ మాత్రమే మిగిలింది. అయితే చివరి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యాన్ని తగ్గించేలా టీఆర్‌ఎస్ ఓట్లు సాధిస్తే తప్పా.. బీజేపీ విజయం దాదాపు ఖాయమైనట్లుగానే చెప్పవచ్చు. చివరి రౌండ్ కౌంట్ జరుగుతోంది. చివరి రౌండ్‌లో కూడా బీజేపీ ఆధిక్యంలో నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. చివరి రౌండ్ ఫలితం తేలకుండానే బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
చివరి రౌండ్‌లోని ఈవీఎంలలో నాలుగు మోరాయించినట్లు సమాచారం. ఇందులో 1690 ఓట్లకు సంబంధించిన ఫలితం వెల్లడి కావాల్సి ఉది. దీని వల్ల అధికారులు 23వ రౌండ్ ఫలితం వెల్లడించడం లేదని సమాచారం.