తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
Read Also: అమరావతి – మాణిక్య వరప్రసాద్ రాజీనామా
గతంలో టీడీపీ ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. కాగా ఈరోజు ఉదయం పార్టీ వైఖరికి నిరసనగా టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్ తాజాగా ముఖ్యంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
Read Also: టీడీపీకి డొక్కా రాంరాం…
మొదటినుండి తన అభీష్టాలకు వ్యతిరేకంగా సీట్లను కేటాయించారని, టీడీపీలో ఒక వర్గం తనపై అసత్య ప్రచారం చేస్తూ తనపై బురదజల్లాలని చూస్తున్నారని బహిరంగ రాజీనామా లేఖలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పత్తిపాడు టీడీపీ ఇంచార్జ్ పదవిని మాకినేని పెద్ద రత్తయ్యకి కేటాయించడంతో టీడీపీని డొక్కా వీడనున్నారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఈరోజు ఉదయం టీడీపీకి గుడ్ బై చెప్పిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.