Idream media
Idream media
ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజారపు అచ్చెం నాయుడుకు దాదాపు 77 రోజుల తర్వాత బెయిల్ లభించింది. దీంతో అచ్చెం నాయుడు అనుచరులు, అభిమానులు ఆనందంలో ఉన్నారు. అయితే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. అచ్చెం నాయుడు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళతారా..? లేదా..? అనేదే అందరిలోనూ నెలకొన్న సందేహం. ఇందుకు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
అచ్చెం నాయుడు బెయిల్ పొందినా ఇప్పటికిప్పుడు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లబోరని చెబుతున్నారు. ఎందుకంటే.. అచ్చెం నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ 77 రోజులుగా ఆయనకు ఫైల్స్ తగ్గలేదు. వాటి పరిస్థితి ఎలా ఉందో హైకోర్టు తప్పా బయట ప్రపంచానికి తెలియదు. ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెం నాయుడు వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందే తప్పా.. ఫైల్స్ తగ్గాయని కాదు.
అరెస్ట్‌కు ముందే జరిగిన ఫైల్స్‌కు మళ్లీ అవసరం పడడంతో గుంటూరు సమగ్ర ఆస్పత్రిలో చిన్న పాటి శస్త్ర చికిత్స చేశారు. దాని తాలుకూ గాయం మానడంతో జూన్ 30వ తేదీన డిశ్ఛార్జి చేశారు. కానీ తనకు తగ్గలేదంటూ అచ్చెం నాయుడు హైకోర్టుకు వెళ్లి గెలిచి.. తాను కోరుకున్నట్లు గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో ఉన్నారు. అయితే కరోనా సోకిందని ఆగస్టు 18వ తేదీన ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి మారారు. ఆగస్టు 13 వరకు అంటే.. 44 రోజులపాటు గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలో అచ్చెం నాయుడు ఫైల్స్‌కు చికిత్స తీసుకున్నారు. అయినా ఆయనకు ఫైల్స్ తగ్గలేదు.
కరోనా సోకిందని 13వ తేదీ తెలుపగా.. ఆ తర్వాత ఈ నెల 18వ తేదీ వరకూ గుంటూరు రమేష్ ఆస్పత్రిలోనే ఉన్నారు. 18వ తేదీన కోవిడ్ రక్షణ చర్యలు లేకుండానే అచ్చెం నాయుడును రమేష్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడే అసలు అచ్చెం నాయుడుకు కరోనా సోకిందా..? లేదా..? అనే సందేహం ప్రజల్లో కలిగింది. ప్రస్తుతం ఆయన ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఉంటున్నారు.
Read Also ; అచ్చెం నాయుడుకు బెయిల్
బెయిల్ మంజూరైందని ఇప్పటికిప్పుడు లేదా రెండు మూడు రోజుల తర్వాతైనా అచ్చెం నాయుడు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళితే.. రెండున్నర నెలలుగా తగ్గని ఫైల్స్ బెయిల్ రాగానే తగ్గాయా..? అనే ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తుంది. అచ్చెం నాయుడు ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్ అయ్యారనే విషయం కన్నా.. రెండున్నర నెలలుగా ఆయనకు ఫైల్స్ తగ్గలేదన్న అంశంపైనే ప్రజల్లో విస్తృతమైన చర్చ జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అచ్చెం నాయుడు వెంటనే ఇంటికి వెళతారా..? లేదా కరోనా పేరు చెప్పి ఆస్పత్రిలోనే మరికొన్ని రోజులు ఉంటారా..? అనేది వేచి చూడాలి.