Idream media
Idream media
దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ శుభ వార్త చెప్పింది. సదరం సర్టిఫికెట్ కోసం అధికారులు, వైద్యుల చుట్టూ తిరిగే అవస్థను తగ్గించింది. నూతనంగా సదరం సర్టిఫికెట్ పొందేందుకు సరళమైన విధానాన్ని రూపొందించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళతరం చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తగా 52 సెంటర్ల ద్వారా ఇకపై వారానికి రెండు దఫాలుగా సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. ఇందుకు అవసరమైన ప్రణాళిక రచించింది.
డిసెంబర్ 3న వరల్డ్ డిజేబుల్డ్ డే నాటి నుంచి నూతన మార్గదర్శకాల ప్రకారం సదరం సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. డిసెంబర్ 15 నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా వారానికి ఒక రోజు సదరం క్యాంపు నిర్వహించనున్నారు. అర్హులైన వారందరికీ వీలైనంత వేగంగా సర్టిఫికెట్లు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి 3, 4 రోజుల్లో సర్టిఫికెట్ అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేసేలా జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది.