iDreamPost
iDreamPost
మన దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి సైన్యం గుప్పిట్లో చిక్కుకోనుందా?.. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై పదవి నుంచి తప్పుకోమని ఒత్తిడి పెరుగుతోందా.. ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా పాకిస్తాన్‌లో పరిస్థితులు బాగా క్షీణించాయి.ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం ఇంటా బయటా అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటోంది. వీటన్నింటికీ మించి సైన్యాధిపతి బజ్వా, ప్రధాని ఇమ్రాన్ మధ్య ఐఎస్ఐ చీఫ్ నియామకం విషయంలో తలెత్తిన స్ఫర్థలు.. తీవ్ర విభేదాలుగా రూపాంతరం చెందాయి. ఫలితంగా ఇమ్రాన్ ప్రభుత్వాన్ని గద్దె దించే కార్యక్రమానికి సైన్యం శ్రీకారం చుట్టింది.
కత్తి కట్టిన సైన్యం
పాకిస్తాన్ ప్రధాన నిఘా సంస్థ అయిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్ ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఆయన్నే కొనసాగించాలని సైనిక దళాల అధిపతి జనరల్ ఖమార్ జవేద్ బజ్వా భావించగా.. కొత్త అధిపతిని నియమించాలని ప్రధాని ఇమ్రాన్ అనుకున్నారు. అది తేలక కొన్నాళ్లు జాప్యం జరిగింది. దానిపైనే అసంతృప్తి చెందిన జనరల్ బజ్వాను.. ఐఎస్ఐ కొత్త చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజూమ్ పేరు ఖరారు చేయడం..ఆయన ఈ నెల 20న పదవీ బాధ్యతలు చేపట్టనుండటంతో మరింత అసహనానికి గురి చేసింది. సైన్యం అభీష్టానికి వ్యతిరేకంగా వ్యవరిస్తుండటం, తన చర్యలతో ఇతర దేశాల్లో సైతం విమర్శల పాలవుతుండటం, దేశాన్ని ఆర్థికంగా దివాలా తీయించడం.. తదితర కారణాలతో ఇమ్రాన్ ప్రభుత్వంపై సైన్యం పరోక్ష యుద్ధంBitcoin Scandal, Karnataka CM – బిట్ కాయిన్ కుంభకోణం.. ఉక్కిరిబిక్కిరి అవుతోన్న బొమ్మై సర్కారు ప్రకటించింది.
Also Read :
ప్రధానికి రెండు ఆప్షన్లు
ఇమ్రాన్‌ను గద్దె దించడానికి ఇప్పటికే ఆర్మీ చీఫ్ బజ్వా పావులు కదుపుతున్నారు. అవసరమైతే సైనిక తిరుగుబాటుకైనా సిద్ధపడుతున్నారు. మొదట ఇమ్రాన్ ఖాన్‌కు రెండు ఆప్షన్లు ఇచ్చారు. తనంతట తాను పదవి నుంచి తప్పుకోవడం మొదటి అవకాశం కాగా.. పదవి నుంచి తప్పించడం రెండో ఆప్షన్. ప్రస్తుతం పాక్ లో ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) ప్రభుత్వం అధికారంలో ఉండగా ముత్తహిద్ క్వామి మూవ్ మెంట్ (ఎంక్యూఎం), పాకిస్తాన్ ముస్లిం లీగ్ (క్యూ) పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కాగా ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని ఈ రెండు పార్టీలను ఆర్మీ చీఫ్ ఇప్పటికే సూచించారు. ఇమ్రాన్ బదులు కొత్తగా ఎవరిని ప్రధానిగా ఎంపిక చేయాలన్న మంతనాలు కూడా జరుగుతున్నాయి. పీటీఐ పార్టీకి చెందిన పర్వేజ్ ఖట్టక్, ముస్లిం లీగ్‌కు చెందిన షాబాజ్ షరీఫ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
సైనిక పాలనా.. ప్రత్యామ్నాయ ప్రభుత్వమా?
పాకిస్తాన్‌కు సైనిక తిరుగుబాట్లు, సైనిక చర్యలు కొత్త కాదు. మనతోపాటే స్వాతంత్య్రం పొందిన ఆ దేశంలో ప్రజాస్వామ్య పునాదులు అత్యంత బలహీనంగా ఉన్నాయి. రాజకీయ అస్థిరత కారణంగా 1953 నుంచి అనేకసార్లు సైన్యం దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. జనరల్ ఆయుబ్ ఖాన్, జియా ఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్ తదితర సైన్యాధికారులు ప్రభుత్వ పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఆ అనుభావాల నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి తప్పుకోవడమో.. సైన్యం తప్పించడమో ఖాయంగా కనిపిస్తోంది. ఇమ్రాన్ ప్రభుత్వ స్థానంలో కొత్త ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు సైన్యం అవకాశం ఇస్తుందా లేక గతంలో మాదిరిగా పాలనను తన చేతుల్లోకి తీసుకుంటుందా అన్నదే ఉత్కంఠ రేపుతోంది.
Also Read : ABN Andhra Jyothi, Amit Shah, AP BJP – నాపై దాడి చేసిన వారికి సన్మానం చేయలేదా ?