iDreamPost
android-app
ios-app

“GULABO SITABO” లో నటించింది అమితాబచ్చనే అనడానికి ప్రూఫ్ ఏంటి? – TNR

“GULABO SITABO” లో నటించింది అమితాబచ్చనే అనడానికి ప్రూఫ్ ఏంటి? – TNR

నిన్న అమెజాని ప్రైం లో రిలీజ్ అయిన “GULABO SITABO” చూశాను.
ఏదో ఈ లాక్ డౌన్ టైం లో OTT లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన స్టార్ సినిమా,అందులోనూ అమితాబ్ సినిమా అనే ఒక క్రేజ్ తో చూడతమే తప్ప ఎక్కడా పెద్దగా కిక్కివ్వలేదు…
కొత్త సినిమా కాబట్టి…మొత్తం చూడకుండా కామెంట్ చెయ్యడం తప్పు కాబట్టి బలవంతంగా రెండుగంటలు చాలా ఓర్పుతో పూర్తి చేశాను..
నాకైతే…బోరింగ్ ఫిల్మ్…
కేవలం అమితాబచన్ లాంటి సూపర్ స్టార్ నటించాడు కాబట్టి,
“వికీ డోనర్”,”పీకు”,”అక్టోబర్”,”మద్రాస్ కేఫ్” లాంటి మంచి సినిమాలు డైరెక్ట్ చేసిన సుజిత్ సర్కర్ దీనికి దర్శకుడు కాబట్టి,దీన్ని మెచ్చుకోకపోతే ఎవరేమైనా అనుకుంటారేమో అనే మొహమాటంతో అయితే మాత్రం దీన్ని గొప్ప సినిమా అనలేను.
అదీకాకుండా ఇది ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయిన సినిమా కాదు కాబట్టి, చూసే వాళ్ళు ఎలాగూ OTT లో చూస్తారు కాబట్టి,నా కామెంట్ వల్ల ఈ సినిమా నిర్మాతకి ఎలాంటి నష్టం లేదు కాబట్టే ఈ కామెంట్ పెడుతున్నాను.
మీకు తెలుసు ..నాకు సినిమా నచ్చితేనే కామెంట్ పెడతాను…లేదంటే సైలెంట్ గా ఉంటానని..
అసలు ఈ కామెంట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ సినిమా విషయం లో నాకున్న ఒక ముఖ్యమైన అనుమానం తీర్చుకోడానికే…. అదేంటంటే..
సినిమాలో నచ్చిన ఏకైక అంశం ఓల్డ్ మ్యాన్ గా అమితాబ్ నడక…బాడీ లాంగ్వేజ్…
పర్ఫార్మెన్స్ విషయం లో అమితాబ్ ని మెచ్చుకుందామంటే అసలు ఆ ముఖం లో అమితాబ్ పోలికలు నాకేమైనా కనపడితే కదా…?..
ఎక్కువగా మాట్లాడితే…”యాక్ట్ చేసింది అమితాబే అని గ్యారెంటీ ఏంటి?” అని అడుగుతాను..
ఈ సినిమా మీద నాకున్న పెద్ద కంప్లెయింట్ ఏంటంటే……..సినిమాలో ఉన్నది అమితాబచన్ అని ఎవరైనా చెబితే తప్ప తెలియనప్పుడు అక్కడ అమితాబచనే ఉండాల్సిన అవసరం ఏముంది…?
నాలాంటి అమితాబ్ వీరాభిమాని సినిమా చూసేది తన హావభావాలు చూడటానికే కదా…?
తను పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు తన ముఖకవళికలని ఎంజాయ్ చెయ్యడానికే కదా…?
మరి ఆ ముఖ కవళికలు తెలియనప్పుడు, నాకు నచ్చిన అమితాబ్ ఎక్స్ ప్రెషన్స్ ని మేకప్ తో కప్పేసినప్పుడు ఆమాత్రం దానికి అదే హైట్ లో ఉన్న ఒక మంచి స్టేజ్ నటున్ని తీసుకొచ్చినా అదే ఔట్ పుట్ వస్తుంది కదా…?
కాదు కాదూ …అక్కడ మాకు అమితాబచన్ బ్రాండే కావాలి అని అనుకున్నప్పుడు ఆయన ముఖం మాకు కనపడాలి కదా..?
అమితాబచన్,రజనీకాంత్,చిరంజీవి,కమలహాసన్ లాంటి స్టార్స్ యొక్క అసలు ముఖాలు కప్పి పెట్టి వాళ్ళ నటనని ఆస్వాదించే పరిస్థితిలేకుండా వాళ్ళతో సినిమా తీసే అవసరం ఏంటీ,దాని వల్ల ఉపయోగం ఏంటి అన్నదే నా ప్రశ్న…
అసలు ఈ సినిమాలోని నటుడు అమితాబ్ బచన్ అని ప్రమోషన్ చెయ్యకపోతే గనక మనలో ఎవరమైనా అమితాబచన్ ని గుర్తుపట్టగలమా…?
అయినా మీరేమైనా అమీర్ ఖాన్ కి ఆ గెటప్ వేశారా….ఆల్ రెడీ వయసుదాటిపోయిన అమితాబచన్ కే కదా…?
ఆల్ రెడీ వృద్ధాప్యం లో ఉన్న అమితాబచన్ ని వృద్ధుడిలా, అది కూడా మీరు సబ్ టైటిల్స్ వేస్తే తప్ప ఈయన అమితాబచన్ అని గుర్తుపట్టలేనంత కొత్తగా చూపించాల్సిన అవసరం ఏముంది…?
ఒక సూపర్ స్టార్ ముఖంలోని పోలికలే తెలియకుండా మేకప్ చెయ్యడమన్నది రాంగ్ కాన్సెప్ట్ అని నేననుకుంటాను.
గతం లో కమలహాసన్ దశావతారంలో కూడా కొన్ని గెటప్స్ కి ఇదే తప్పు జరిగింది.
నావరకయితే ఒక నటుడి ఫీచర్స్ ని ప్రేక్షకులు గుర్తుపట్టేలా చేస్తూ అతన్ని డిఫరెంట్ గా చూపించడమే గొప్ప మేకప్.
ఏది ఏమైనా…మేకప్ విషయం లో ఇది నాకు వ్యక్తిగతంగా అనిపించిన అభిప్రాయం మాత్రమే..
బహుశా నా అభిప్రాయం తప్పు కూడా అయి ఉండొచ్చు…
ఈ విషయం లో మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికే ఈ పోస్ట్…
ఇక సినిమాలో ఉన్న కంటెంట్ గురించి మాట్లాడుకుంటే గనక…
సినిమాలో ఉన్నది నిజంగా గొప్ప కంటెంటే…. కానీ నెరేషన్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు… ఒక సినిమాకి గొప్ప కంటెంట్ ఇంపార్టెంటా….ఇంట్రెస్టింగ్ నెరేషన్ ఇంపార్టెంటా అంటే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ నెరేషన్ కే నా వోటు.
ఇంట్రెస్టింగ్ నెరేషన్ లేకుండా కేవలం గొప్ప కంటెంట్ ఉన్నంత మాత్రాన అది అందరి ఆదరణని నోచుకునే సినిమా అయిపోదు…
గొప్ప కంటెంట్ లేకపోయినా ఇంట్రెస్టింగ్ నెరేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది అందరి ఆదరణని నోచుకునే సినిమా అవుతుంది.
సినిమాని ప్రేమించే,సినిమాని అణువణువునా ఆస్వాదించే సాధారణ ప్రేక్షకుడికి కావాల్సింది మాత్రం కేవలం ఆ ఇంట్రెస్టింగ్ నెరేషనే…
అది ఈ సినిమాలో మిస్ అయింది…
పెద్ద worth waiting అయితే కాదు..
అమితాబచన్ ని అలా గుర్తుపట్టలేకుండా ఎలా మేకప్ చేశార్రా అని తెలుసుకోడానికోసం సరదాగా చూద్దాం అనుకుంటే మాత్రం హాప్పీగా చూసెయ్యొచ్చు.
Now eagerly waiting for Karthik subbaraju’s “P E N G U I N” – TNR