iDreamPost
android-app
ios-app

ముందు చూసిందెవరు..? రేప్ ఆలోచన వచ్చిందెవరికి..?

ముందు చూసిందెవరు..? రేప్ ఆలోచన వచ్చిందెవరికి..?

దిశ ఘటనపై తెలంగాణ పోలీసులు వేగంగా, లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 20 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఐఏఎస్ ల నేతృత్వంలో 7 బృందాలు ఈ కేసుపై దర్యాప్తు దారుపుతున్నాయి. దిశ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. ఇప్పటికి ప్రజల్లో ఆగ్రహావేశాలు రగులుతూనే ఉన్నాయి. నిరసనలు నిరాటంకంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసును వీలైనంత త్వరగా ముగించి, నిందితులను దోషులుగా నిరూపించి వారికి శిక్ష పడేలా చేసేందుకు పోలీసులు పని చేస్తున్నారు.

Also Read : దిశ నిందితుల ఎన్కౌంటర్

అసలు ఘటన ఎలా జరిగింది అనే అంశం పై నిందితులను ఘటనా స్థలానికి పోలీసులు తీసుకెళ్లారు. సీన్ రి కంస్ట్రక్ట్ దర్యాప్తులో ఒక భాగం. బుధవారం అర్ధ రాత్రి అత్యంత గోప్యంగా నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారించారు. షాద్ నగర్ స్టేషన్ నుంచి చర్ల పల్లి జైలుకు తరలించే సమయంలో వేలాది మంది ప్రజలు నిందితులపై దాడికి దిగిన విషయం తెలిసిందే. వారిని జైలుకు తరలించేందుకు దాదాపు 1000 మంది పోలీసులు బందోబస్తుగా వచ్చినా.. ప్రజలు రాళ్లు రువ్వుతూ తమ ఆగ్రహాన్ని చూపారు. ఈ నేపథ్యంలో నిందితులను బయటకు తీసుకొస్తున్న విషయం గోప్యంగా ఉంచారు.

అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నిందితులు మహ్మద్‌ ఆరిఫ్, జొల్లు నవీన్, శివ, చెన్నకేశవులును చర్లపల్లి జైలు నుంచి తొలుత తొండుపల్లి టోల్‌గేట్‌ ప్రాంతంలో ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. అక్కడ లారీ నిలిపిన స్థలం, మద్యం తాగిన ప్రాంతాలను పరిశీలిం చారు. దిశను ముందు చూసిందెవరు? అత్యాచారం ఆలోచన ముందు ఎవరికి వచ్చింది?.. తదితర వివరాలు తెలుసుకున్నారు.

పంక్చర్‌ చేసిందెవరు? స్కూటీ బాగు చేయించేందుకు ఏ షాప్‌కు వెళ్లారు? దిశను ఎత్తుకెళ్లిన ప్రాంతాన్ని నిందితులు పోలీసులకు చూపించారు. అత్యా చారం జరిగిన ప్రాంతానికి సమీపంలో పాతి పెట్టిన దిశ మొబైల్‌ను నిందితులతోనే తవ్వి తీయించారు. అక్కడి నుంచి దిశ మృతదేహాన్ని క్యాబిన్‌లో ఎలా వేసుకుని వెళ్లారు? ఎవరెవరు సాయం చేశారు? నవీన్, శివ పెట్రోల్‌ కొన్న బంకులు కూడా చూపించారు. ఇక షాద్‌నగర్‌ వైపు వెళ్లిన తర్వాత వెనక్కి రావడం, చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద మృతదేహాన్ని దహనం చేసేవరకు జరిగిన ఉదంతాన్ని నిందితులు పోలీసులకు కళ్లకు కట్టారు.

చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద లారీని నిలిపిన నిందితులు మృతదేహాన్ని క్యాబిన్‌ నుంచి దించారు. వారే మోసుకెళ్లి బ్రిడ్జి కింద ఒక మూలకు ఈడ్చుకెళ్లినట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. తొండుపల్లి వద్ద ఘటనాస్థలంలోనే దిశ చనిపోయినా.. ఇంకా దిశ బతికే ఉండొచ్చన్న అనుమానంతో ఆనవాళ్లు కూడా దొరక్కుండా వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో పాటు, లారీ నుంచి డీజిల్‌ తీసి దహనం చేసిన విధానాన్ని వివరించారు. ఆ మంటల్లోనే దిశ సిమ్‌ కార్డులు వేసినట్లు సమాచారం.