iDreamPost
iDreamPost
దిశ ను అత్యాచారం చేసి బతికి ఉండగానే పెట్రోల్ పోసి కాల్చి చంపిన నిందితులు ఈ తెల్లవారుజామున ఎన్కౌంటర్లో చనిపోయారు.
దిశా ఉదంతం మీద తీవ్రంగా స్పందించిన పౌర సమాజం వారిని కఠినంగా శిక్షించాలని ,గతంలో వరంగల్ యాసిడ్ దాడి నిందితులను ఎన్కౌంటర్ చేసినట్లే వీళ్ళను చంపాలని కొందరు బహిరంగంగా డిమాండ్ చేశారు.
నిన్న కోర్టు నిందితులను వారం రోజుల కస్టడీకి అనుమతించింది.దీనితో విచారణ మొదలు పెట్టి,”Scene reconstruction” చెయ్యటానికి ఈ ఉదయం మూడు-నాలుగు గంటల సమయంలో నలుగురు నిందితులను సంఘటన స్థలానికి తీసుకు వెళ్లగా నిందితులు పోలీసుల నుంచి తుపాకీలు లాక్కొని,పారిపోవటానికి ప్రయత్నం చెయ్యగా పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారు.
ఎన్కౌంటర్ జరిగిన చాటాన్ పల్లి ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.సంఘటనా స్ధలం వద్దకు ఎవరిని అనుమతించటం లేదు.పోలీసులు అధికారికంగా ఎన్కౌంటర్ మీద ప్రకటన చెయ్యలేదు.