నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఇసుక చుట్టూనే రాజకీయం సాగింది. వర్షాలు, వరదల కాలంలో సహజంగా ఉండే ఇసుక కొరత పై ;ప్రతి పక్షాలు రాజకీయం చేశాయి. ప్రతి ఏడాది ఇలాంటి పరిస్థితి ఉన్నా ఈ సారే ఇసుక కొరత వల్ల కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు మాట్లాడాయి. నదుల్లో వరద ప్రవాహం తగ్గితే ఇసుక లభ్యత పెరుగుతుందని అధికార వైఎస్సార్ సిపి స్పష్టం చేసింది. కొరతను వీలైనంతగా తగ్గించేందుకు ఈ నెలలోనే ఇసుక వారోత్సవాలు నిర్వహించారు. ఫలితంగా సమస్య తీరడంతో పాటు.. ప్రభుత్వానికి వారం రోజుల్లోనే 70 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
ప్రస్తుతం రాష్ట్రంలోని స్టాక్ యార్డుల్లో 2.95 లక్షల టన్నుల ఇసుక బుకింగ్‌లకు సిద్ధంగా ఉండగా డిమాండ్ మాత్రం సరాసరి 65 వేల టన్నులు ఉంది. డిమాండ్ కు మించి ఐదు రెట్ల ఎక్కువగా ఇసుక లభ్యత ఉండడం ఆది నుంచి జగన్ సర్కార్ చెబుతున్నది నిమమైంది. వరద ప్రవాహం తగ్గడంతో ఇసుక అందుబాటులోకి వచ్చింది.
ఏడాది మొత్తమ్మీద చూస్తే రోజుకు సగటు వినియోగం 80 – 85 వేల టన్నులు పైగా ఉంటుందని అనధికారిక అంచనా. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మందగమన పరిస్థితుల వల్ల నిర్మాణరంగంలో పనులు తగ్గాయి. వేసవితో పోల్చితే వర్షాకాలంలో నిర్మాణ పనులు మరింత తక్కువగా ఉంటాయి. ఈ ప్రభావం ఇసుక వినియోగంపైనా ఉంటుంది. అందుకే ప్రస్తుతం 60 నుంచి 65 వేల టన్నుల వినియోగం ఉంది.