దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కొత్త పంథాను ఎన్నుకుంది. ఇక నుండి ప్రజా సమస్యలపై జాతీయస్థాయిలో పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ తన పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. మోడీ వైఫల్యాల మీద పోరాటం చేస్తున్న అనుకున్నంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేకపోవడంతో ఇక నుంచి ప్లాన్ మార్చాలని డిసైడ్ అయింది.
మోడీ ప్రభుత్వ వైఫల్యాలు మరియు జాతీయస్థాయి సమస్యల మీద పోరాటం కోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ ఏఏ జాతీయ స్థాయిలో అంశాలమీద పోరాటo చేయాలో ఈ కమిటీ డిసైడ్ చేసే అవకాశం ఉంది. దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన ప్రియాంకా గాంధీతో పాటు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మనీశ్ ఛత్రత్, బీకే హరిప్రసాద్, రిపున్ బోరా, ఉదిత్ రాజ్, రాగిణి నాయక్, జుబిర్ ఖాన్ సభ్యులుగా ఉంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇక నుంచి చేయబోయే ప్రజా సమస్యల పైన పోరాటం ఎలా చేయాలి. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా విమర్శిస్తూ క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు జోష్ నింపాలని అందుకోసం చేపట్టాల్సిన ఆందోళనా కార్యక్రమాలను రూపొందించేందుకు కావలసిన ప్రణాళికలను ఈ కమిటీ రూపొందిస్తోంది. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతుందని పోరాడాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఈ కమిటీలో గాంధీ కుటుంబం నుంచి ప్రియాంక గాంధీకి మాత్రమే చోటు దక్కింది. అయితే ఈ కమిటీలో రాహుల్ గాంధీకి చోటు దక్కలేదు. అంటే ఇక నుంచి రాహుల్ గాంధీ లేకుండానే మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుందని తెలుస్తోంది. రాహుల్ గాంధీ పార్టీ బలోపేతంపై దృష్టి పెడతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
అంతర్గత కుమ్ములాటలు,అసమ్మతి రాగాలు అన్నిటికీ చెక్ పెట్టి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే జాతీయస్థాయిలో పోరాటానికి పూర్తి సిద్ధం కావాల్సిందే. ఏదేమైనా వచ్చే ఏడాది మెజార్టీ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2023 లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ గట్టిగానే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి సమస్యలను గుర్తించి వాటిపై ఆందోళన చేయడం ద్వారా ప్రజల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల విశ్వాసం పొందాలని ప్రయత్నించడం ఆహ్వానించదగ్గ పరిణామం. మోడీ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఈ ఆందోళన ద్వారా తమ వైపు తిప్పుకుంటుందో లేదో చూడాలి.
Also Read : గెలిచే కాదు ఓడిపోయి రికార్డ్ సృష్టించొచ్చు ,ఎలానా?