iDreamPost
android-app
ios-app

మాటల మాంత్రికుడి హీరో చేంజ్ ?

  • Published Apr 05, 2021 | 9:11 AM Updated Updated Apr 05, 2021 | 9:11 AM
మాటల మాంత్రికుడి హీరో చేంజ్ ?

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రకటనలు కూడా గతంలోనే వచ్చాయి. రేపో ఎల్లుండో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్న తరుణంలో ఈ ప్రాజెక్ట్ నిరవధికంగా వాయిదా పడిందనే ప్రచారం అభిమానులను ఖంగారు పెట్టింది. స్క్రిప్ట్ విషయంలో హీరో దర్శకుడు ఇద్దరూ అసంతృప్తిగా ఉండటంతో ఫ్యూచర్ లో వేరేది చేద్దామనే ఆలోచనతో పెండింగ్ లో పెట్టేసినట్టు ఓ మీడియా వర్గంలో కథనం వచ్చింది. కానీ దీనికి సంబంధించి హారిక హాసిని సంస్థ నుంచి ఇప్పటికైతే ఎలాంటి క్లారిటీ రాలేదు.

అంతేకాదు తారక్ ప్రాజెక్టు స్థానంలో త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేయొచ్చని కూడా మరో గాసిప్ బయటికి వచ్చింది. అతడు, ఖలేజా తర్వాత మళ్ళీ ఈ కాంబినేషన్ సాధ్యపడలేదు. ఏదైనా స్టోరీ సెట్ అయితే చేద్దామనుకున్నారు కానీ ఏవో కారణాల వల్ల కుదరలేదు. ఇక్కడ చెప్పిన న్యూస్ ప్రిన్స్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అవ్వొచ్చమో కానీ ఇదంతా కొత్త అయోమయానికి దారి తీస్తోంది. ఇన్ సైడ్ సోర్స్ చెబుతున్న దాని ప్రకారం ఇదంతా అబద్దమేనని అంటున్నారు. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే వీలైనంత త్వరగా షూట్ కు వెళ్ళిపోవాలి. కానీ ఆర్ఆర్ఆర్ నుంచి రాజమౌళి తన హీరోలను ఎప్పుడు విముక్తులను చేస్తాడో తెలియదు.

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఖచ్చితంగా సినిమా చేసే అవకాశాలు ఉన్నది ఇద్దరు దర్శకులకే. ఒకరు త్రివిక్రమ్ కాగా మరొకరు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా. వీళ్ళకే క్లియర్ కమిట్ మెంట్ ఇచ్చాడు. అసలే అరవింద సమేత వీర రాఘవ తర్వాత మూడేళ్ళ గ్యాప్ రావడం యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి మింగుడు పడటం లేదు. ప్రభాస్ తరహాలో తారక్ కూడా వేగం పెంచి వరసగా సినిమాలు ప్రకటించాలని కోరుతున్నారు. కానీ జూనియర్ మాత్రం ఎలాంటి తొందరపాటు ప్రదర్శించే పరిస్థితిలో లేడు. ఇదంతా ఎలా ఉన్నా కనీసం ఉగాదికి తారక్ త్రివిక్రమ్ లు సాలిడ్ అప్ డేట్ ఇస్తే ఇలాంటి ప్రచారాలు ఆగిపోయే ఛాన్స్ ఉంది