Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలను విమర్శించే సాహసం చేయలేకపోతోంది. ఎందుకంటే అవి ఎంతలా ఆదరణ పొందుతున్నాయో ఇటీవల ఎన్నికల్లో ఓట్ల ద్వారా ప్రజలు తీర్పునిచ్చారు. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా అప్పుడప్పుడు వార్తలో నిలిచే ప్రయత్నం చేస్తుంటారు. చివరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర పెద్దలతో సమావేశాలను కూడా రాజకీయంగా మలుచుకుంటున్నారు.
దీనిలో భాగంగానే కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటన రద్దు కావడం ఏ ముఖ్యమంత్రికీ జరగని ఘోర అవమానంగా హడావిడి చేశారు. కావాలనే అమిత్ షా జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, దాని వెనుక పెద్ద కారణాలు ఉన్నాయని కట్టుకథలు అల్లారు. కట్ చేస్తే.. మూడురోజుల్లోనే జగన్ ఢిల్లీ వెళ్లారు. ప్రముఖులను కలిసి కీలక విషయాలు చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గంటా 45 నిమిషాల పాటు జగన్ తో చర్చించారు.
ఈ నెల 7న జగన్ ఢిల్లీ వెళ్లనున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అంతే ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా చేసిన హడావిడి తెలిసిందే. ఇది జరిగిన మూడే మూడు రోజుల్లో జగన్ ఢిల్లీ వెళ్లారు. గురువారం కేంద్ర మంత్రులు అమిత్ షా, ప్రకావ్ జవదేకర్, గజేంద్ర సింగ్ షెకావత్ వంటి ప్రముఖులతో పాటు నీతి ఆయోగ్ వైస్‌ఛైర్మన్ రాజీవ్‌కుమార్ తో కూడా భేటీ అయ్యారు.
ప్రతి ఒక్కరూ జగన్ సరైన ప్రాధాన్యం ఇచ్చి సమయం కేటాయించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం తపనను కొనిడాయారు. జగన్ పాలనలోని ఏపీ అభివృద్ధిని రాజీవ్‌కుమార్ కొనియాడుతూ ట్వీట్ కూడా చేశారు. ‘పలు రంగాల్లో ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోంది. 2020-21 సుస్థిర అభివృద్ధి రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. ఏపీ వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవశ్యకతను సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, లక్ష్యాలను సీఎం జగన్ వివరించారు’ అని ఆయన ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.
అంతేకాదు.. ముఖ్యమంత్రి జగన్ కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దాదాపు గంటా 45 నిమిషాల వరకూ సమయం కేటాయించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఆయనతో చర్చించారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును వివరించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును, అనాథలకు అందిస్తున్న సాయంపై జగన్ ను హోం మంత్రి అభినందించినట్లు తెలిసింది.
ఒకే రోజు నలుగురి ప్రముఖుల అపాయింట్ మెంట్ పొందడం, ప్రతి ఒక్కరూ జగన్ కు అధిక సమయం కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చేసే పర్యటనలపై రాద్దాంతం చేసే విపక్ష నాయకులకు జగన్ ఎందుకోసం ఢిల్లీ వెళ్లారో ఇప్పుడైనా క్లారిటీ వచ్చిందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాజీవ్‌కుమార్ అయితే చర్చల అంశాన్ని బహిర్గతంగానే పేర్కొనడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.