iDreamPost
iDreamPost
మొన్న విడుదలైన అల్లుడు అదుర్స్ ఫలితం ఏంటనే దాని మీద క్రిస్టల్ క్లారిటీ వచ్చేసింది. రిలీజ్ కు ముందు యూనిట్ గొప్పగా చెప్పుకున్న మాటల్లో విషయం లేదని అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఇంత అవుట్ డేటెడ్ కథతో కోట్లు ఖర్చు పెట్టేలా నిర్మాతను ఎలా ఒప్పించారన్న దాని మీదే ఎక్కువ చర్చ జరుగుతోంది. చాలా గ్రాండ్ గా చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ పదే పదే కందిరీగ లాంటి సినిమాలో నా కొడుకుని చూడాలనుకున్నానని, ఇప్పటికి తీరిందని పదే పదే చెప్పడం చూస్తే దాన్నే మళ్ళీ తీశారా అనే కామెంట్లు ఎక్కువగా వచ్చాయి.
పలు ఇంటర్వ్యూలలో సంతోష్ శ్రీనివాస్ కందిరీగ సీక్వెల్ కు ప్లానింగ్ జరుగుతోందని త్వరలో వివరాలు చెబుతానని నొక్కి చెప్పాడు. అంటే కందిరీగ 2కి గ్రౌండ్ రెడీ అవుతోందని మెసేజ్ ఇచ్చినట్టే. అయితే అసలు ఆ సినిమాలో వాడింది ఇప్పుడు అవుట్ డేట్ అయిన ఫార్ములా. అప్పుడేదో ఆ ట్రెండ్ కు తగ్గట్టు ఆడి పేరు డబ్బులు తీసుకొచ్చింది. దాన్ని ఇంకా వాడుతూ ఉంటే ఏమనాలి. అల్లుడు అదుర్స్ హీరో ఓ డైలాగు అంటాడు. అమ్మానాన్నాలను చూస్తూ ఎప్పుడూ రొటీనేనా అని నిలదీస్తాడు. కానీ అసలు తమకథే అంతకన్నా రొటీన్ ఉందనే విషయం అందరూ మర్చిపోయినట్టు ఉన్నారు.
సో అర్జెంటుగా అందరూ కందిరీగ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రావడం మంచిది. అసలే సంతోష్ శ్రీనివాస్ బాలకృష్ణతో ఓ సినిమా చేసేందుకు ప్లానింగ్ లో ఉన్నాడు. ఆల్రెడీ ఓ డిస్కషన్ కూడా జరిగిందట. ఇప్పుడీ తాజా ఫలితం చూసి బాలయ్య మనసు మార్చుకుంటారా లేక అవేవి పట్టించుకోకుండా గతంలోలాగే ఓకే చెప్పేస్తారా అనేది వేచి చూడాలి. రెండు డిజాస్టర్లు, ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా సంతోష్ శ్రీనివాస్ తన ఆలోచనా విధానాన్ని మార్చుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇందులో కొంత స్క్రిప్ట్ సాయం చేశారన్న మాట నిజమో కాదో ఆయనే ఓసారి క్లారిటీ ఇస్తే బెటరేమో.