iDreamPost
android-app
ios-app

ధమాకా జోడి ట్రోలింగ్ లో లాజిక్ ఏది?

  • Published Sep 01, 2022 | 12:03 PM Updated Updated Sep 01, 2022 | 12:03 PM
ధమాకా జోడి ట్రోలింగ్ లో లాజిక్ ఏది?

క్రాక్ బ్లాక్ బస్టర్ అయ్యాక ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ రూపంలో వరసగా రెండు డిజాస్టర్లు అందుకున్న మాస్ మహారాజా కొత్త సినిమా ధమాకా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ప్రోమోలు ఒక్కొక్కటిగా బయటికి వదులుతున్నారు. ఆల్రెడీ దించక్ పాట చార్ట్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. నిన్న రొమాంటిక్ గ్లిమ్ప్స్ పేరుతో చిన్న వీడియో రిలీజ్ చేశారు. అందులో రవితేజ, హీరోయిన్ శ్రీలీల పరస్పరం కవ్వించుకునే సీన్ ఒకటి సోషల్ మీడియాకు టార్గెట్ అయిపోయింది. వయసు పరంగా ఇద్దరి మధ్య ముప్పై మూడేళ్ళ గ్యాప్ ఉంది. అందుకే జోడి కంటికి అనలేదని, రోషన్ లాంటి టీనేజ్ కుర్రాడి పక్కన చేశాక శ్రీలీలను సీనియర్ హీరోతో చూడలేమని కామెంట్ చేస్తున్నారు.

ఇక్కడే వీళ్ళు కొన్ని లాజిక్స్ మిస్ అవుతున్నారు. 1981లో ప్రేమాభిషేకం చేసే నాటికి అక్కినేని నాగేశ్వరరావు గారి వయసు అర్ధ శతాబ్దం దాటేసింది. అయినా కూడా తనకన్నా చాలా చిన్నవాళ్ళైన శ్రీదేవి, జయసుధలతో ఆడిపాడితే ప్రేక్షకులు కనకవర్షం కురిపించారు. బడిపంతులులో మనవరాలిగా నటించిన బేబీ శ్రీదేవి ఆ తర్వాత వేటగాడులో ఎన్టీఆర్ తో కలిసి ఆకు చాటు పిందె తడిసె అంటూ వర్షంలో తడిస్తే బాక్సాఫీసు రికార్డులు బద్దలయ్యాయి. దెబ్బకు వీళ్లది హిట్ కాంబోగా నిలిచిపోయింది. అంతెందుకు ఠాగూర్ చేసే టైంలో చిరంజీవి శ్రేయకు మధ్య గ్యాప్, ఖైదీ నెంబర్ 150లో కాజల్ అగర్వాల్, వాల్తేర్ వీరయ్యలో శృతి హాసన్ అందరూ మెగాస్టార్ ఏజ్ కి తూగనివాళ్లే

ఈ లెక్కన చూస్తే రవితేజ శ్రీలీల జంట మరీ అడ్ కాంబినేషన్ అని చెప్పలేం. కాకపోతే సినిమా రిలీజయ్యాక అభిప్రాయాలు వస్తే బాగుంటుంది కానీ మరీ కొన్ని సెకండ్ల వీడియోకే ఇలా పోస్టు మార్టం చేయడం అన్యాయమని ఫ్యాన్స్ కామెంట్. సినిమా చూపిస్తా మావా, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే ఫేమ్ త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు. దసరాకు అనుకున్నారు కానీ ది ఘోస్ట్, గాడ్ ఫాదర్ ఆల్రెడీ షెడ్యూల్ అయ్యాయి కాబట్టి ఆ రేస్ లో దిగడం అనుమానమే. వరసగా సినిమాలు ఒప్పుకుంటూ ఎవరూ లేనంత బిజీగా ఉన్న రవితేజ ఈ ధమాకా మరోసారి కోరుకున్న బ్రేక్ ఇస్తుందనే ఫ్యాన్స్ నమ్మకం.

marsbahis girişmarsbahismarsbahis girişholiganbet girişjojobet girişjojobetjojobet girişholiganbetjojobetjojobet girişjojobet giriş