ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోగ్యం క్షీణించడంతో హుటాహుటీన ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం ఆయనకు శ్వాస సంబంధ ఇబ్బందులు తలెత్తడంతో లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రికి తరలించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు సిసోడియా ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఇటీవల కరోనా లక్షణాలతో 23 న ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల్లో కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా కరోనాతో పాటు డెంగ్యూ కూడా సోకడంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.
అకస్మాత్తుగా ప్లేట్‌లెట్లు కౌంట్ పడిపోవడం, ఆక్సీజన్ శాతం పడిపోవడంతో ఆయన్ను సాకేత్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కోవడంతో మనీశ్ సిసోడియాను లోక్‌నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.