iDreamPost
android-app
ios-app

ప్రభాస్ 21 కోసం స్మాషింగ్ బ్యూటీ : అఫీషియల్

  • Published Jul 19, 2020 | 5:49 AM Updated Updated Jul 19, 2020 | 5:49 AM
ప్రభాస్ 21 కోసం స్మాషింగ్ బ్యూటీ : అఫీషియల్

నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ప్రభాస్ 21 కు సంబంధించి క్రేజీ అప్ డేట్ అంటూ ఊరిస్తూ వచ్చిన వైజయంతి సంస్థ ఎట్టకేలకు సస్పెన్స్ ని రివీల్ చేసింది. తమ సినిమాలో హీరొయిన్ గా దీపికా పదుకునేని ఆహ్వానిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించేసింది. దీంతో నిన్నటి నుంచి ప్రచారంలో ఉన్నట్టుగా ఫైనల్ గా దీపికానే ఫిక్స్ అయ్యింది. నిజానికి ఇది లీకు రూపంలో నిన్న సాయంత్రం నుంచి చక్కర్లు కొడుతూనే ఉంది. కాకపోతే ఏదైనా గుట్టు మైంటైన్ చేశారేమో చివరి నిమిషంలో ఏదైనా మార్పు ఉండొచ్చేమో అని అభిమానులు ఎదురు చూశారు కాని ఆఖరికి తనే కావడంతో కీలకమైన న్యూస్ తెలిసిపోయింది.

దీపికా తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయడం ఇదే మొదటిసారి. అయితే కెరీర్ లో డెబ్యు జరిగింది మాత్రం కన్నడ సినిమాతోనే. 2006లో ఐశ్వర్యతో తెరంగేట్రం చేసిన దీపికా ఆ తర్వాత వెంటనే బాలీవుడ్ లో ఓం శాంతి ఓం రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ దక్కడంతో అక్కడే సెటిలైపోయింది. ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత టాలీవుడ్ లో అడుగు పెట్టడం విశేషం. వచ్చే ఏడాది ప్రారంభం కాబోతున్న ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ నేషనల్ లెవెల్ కు పెరిగిపోవడంతో ప్రతి సినిమానీ పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేసుకోవాల్సి వస్తోంది.

అందుకే సాహో కోసం శ్రద్ధా కపూర్ ని తీసుకోగా రాదే శ్యాం కోసం నార్త్ ఆడియన్స్ కూ పరిచయమున్న పూజా హెగ్డేని సెట్ చేశారు. ఇప్పుడీ చిత్రం కోసం దీపికా పదుకునేని రంగంలోకి దించారు. ఈ ఏడాది జనవరిలో వచ్చిన చపాక్ తర్వాత దీపికా మళ్ళీ ఇంకే సినిమాలోనూ కనపడలేదు. భర్త రన్వీర్ సింగ్ తో కలిసి 83లో నటించింది కాని లాక్ డౌన్ వల్ల దాని విడుదలకు బ్రేక్ పడింది. ఇప్పుడు ప్రభాస్ సినిమా కాకుండా ఇంకే కొత్త ప్రాజెక్ట్ కమిట్ అయినట్టుగా లేదు. మొత్తానికి ప్రభాస్ 21కి దీపికా పదుకునే లాంటి స్మాషింగ్ బ్యూటీని సెట్ చేయడం దేశవ్యాప్తంగా దీని మీద ఫోకస్ వచ్చేలా చేసినట్టు అయ్యింది. సంగీత దర్శకుడిగా కీరవాణి అన్నారు కాని దానికి సంబంధించిన ధృవీకరణ ఇంకా రావాల్సి ఉంది.

Link Here @ bit.ly/3eOPu9q