Idream media
Idream media
బ్లాక్ లైవ్స్ ఉద్యమానికి నాంది పలికిన జార్జ్ ఫ్లాయిడ్ మరణం తరువాత జాతి వివక్షపై తన గళాన్ని వినిపిస్తున్న వెస్టిండీస్ మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ డారెన్ సామీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. నల్ల జాతీయులైన విండీస్ ఫాస్ట్ బౌలర్‌లను నియంత్రించడానికి అప్పట్లో బౌన్సర్ రూల్‌ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రవేశపెట్టిందని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డారెన్ సామీ ఆరోపించాడు.
1970-80 వెస్టిండీస్ క్రికెట్ జట్టు జైత్రయాత్ర ఆధారంగా తెరకెక్కిన ” ఫైర్ ఇన్ బాబిలాన్” బ్రిటిష్ డాక్యుమెంటరీ చిత్రం గురించి ఐసీసీ ఇన్‌సైడ్ ఔట్ షోలో మాట్లాడుతూ సామీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌లు బౌన్సర్లు సంధించే సమయంలో లేని రూల్‌ని, వెస్టిండీస్ పేసర్లు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నప్పుడే అమలులోకి ఐసీసీ తెచ్చిందని కరేబియన్ మాజీ కెప్టెన్ సామీ విమర్శించాడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలింగ్ ద్వయం జెఫ్రీ రాబర్ట్ థామ్సన్,డెన్నిస్ లిల్లీ అత్యంత భయానక బౌలర్‌లుగా ప్రసిద్ధి చెందారు.తమ ఫాస్ట్ బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్‌లను గాయపరిచారు.అయితే వెస్టిండీస్ బౌలర్‌లు బౌన్సర్‌లను బౌలింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పడతారు.అప్పుడు నేను ఒక నల్ల జట్టు చాలా ఆధిపత్యం చెలాయించడాన్ని చూస్తున్నాను. ఆ సమయంలోనే క్రికెట్‌లో బౌన్సర్ నియమం ప్రవేశపెట్టబడింది.నా భావన తప్పు కావచ్చు,కానీ డాక్యుమెంటరీని చూస్తే అభివృద్ధి చెందుతున్న నల్లజాతి జట్టును అణచివేయడానికి ప్రయత్నాలు జరిగాయని అర్థమౌతుంది.
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డేరెన్ సామీ బౌన్సర్ రూల్ గురించి మాట్లాడుతూ “ఆ సమయంలో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయడం కంటే అతడ్ని గాయపర్చడంలో ఎక్కువగా ఆనందాన్ని వెతుక్కునేవారని ఒక విచిత్రమైన వాదన ఉంది. కానీ అందులో ఆవగింజంత వాస్తవం కూడా లేదు. బౌన్సర్ అనేది ఫాస్ట్ బౌలర్ అమ్ములపొదిలో దాగిన ప్రధాన అస్త్రం. బ్యాట్స్‌మెన్ క్రీజులో కుదురుకోక ముందే బౌలర్లు బౌన్సర్‌లు సంధించి అతడ్ని ఔట్ చెయ్యవచ్చు.ఆరోజులలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా బౌలర్‌లు బౌన్సర్‌లతో బ్యాట్స్‌మెన్‌లను గాయపర్చారు. కానీ క్రికెట్‌లో బౌన్సర్ రూల్‌ని ప్రవేశపెట్టలేదు.ఎప్పుడైతే వెస్టిండీస్ బౌలర్లు బౌన్సర్‌లతో ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించారో అప్పుడే ఈ నియమాన్ని క్రికెట్‌లో ప్రవేశ పెట్టారు” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
20 వ దశకం ఆరంభంలో వెస్టిండీస్ బౌలర్లు భయంకరంగా బౌన్సర్లు సంధించేవారు. సహజంగా ఆరడుగులు పైగా ఎత్తు ఉండటంతోపాటు బలిష్టమైన దేహదారుఢ్యం కలిగి ఉండే కరీబియన్ బౌలర్లు ఓవర్‌కి వరుసగా ఆరు బౌన్సర్లు సంధించిన సందర్భాలూ కూడా ఉన్నాయి. దాంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్ క్రీజులో నిలబడి పరుగులు చెయ్యటం కంటే మెరుపు వేగంతో శరీరంపైకి దూసుకుచ్చే బుల్లెట్ లాంటి బంతులకి గాయపడకుండా తప్పించుకోవడం గురించే ఎక్కువగా ఆందోళన చెందేవారు.
ఇక బౌన్సర్‌ల కారణంగా బ్యాట్స్‌మెన్‌లు గాయపడుతుండటంతో ఐసీసీ 1991లో ఒక్క ఓవర్‌కి ఒక్క బౌన్సర్ అనే రూల్‌ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత టెస్టులతో పాటు, వన్డేలు, టీ20లకి ఈ నియమాన్ని వర్తింపజేసింది. ప్రస్తుతం ఏ ఫార్మాట్‌లోనైనా ఒక ఓవర్‌కి రెండుకి మించి బౌన్సర్స్ వేయడానికి వీల్లేదు. అంతకన్నా ఎక్కువ వేస్తే ఆ బంతిని వైడ్/నో బాల్ గా పరిగణిస్తారు.