తానూ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరే విషయమై ఎన్నికలకు ముందే తన భర్త ఆ పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారాని బిజెపి నేత దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన పురందేశ్వరిని ఈ మేరకు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఎన్నికలకు ముందు వైఎస్సార్ సిపి లో చేరాలని తనకు ఆహ్వానం వచ్చిందని తెలిపారు. తన భర్త, కుమారుడు వైఎస్సార్ సిపి లో చేరే ముందు తాను బిజెపి లోనే కొనసాగుతానని తన భర్త ఆ పార్టీ నేతలకు చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు వైఎస్సార్ సిపి నుంచి ఎలాంటి ఆహ్వానం లేదని పురందేశ్వరి తెలిపారు. వైసీపీకి రాజీనామా చేయాలని ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్న విషయాన్ని తన భర్త వెంకటేశ్వరరావునే అడగాలని సూచించారు. కాగా, దగ్గుబాటి కుటుంభం అంటా ఒకే పార్టీలో ఉండాలని వైఎస్సార్ సిపి అధిష్ఠానం దగ్గుబాటి వెంకటేశ్వర రావు కు చెప్పినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై కొద్దీ రోజులుగా చర్చ జరుగుతోంది.